News January 9, 2026
నల్గొండ: ఆర్టీసీ సేవలు.. బస్సులు ఎన్నంటే..?

నల్గొండ రీజియన్ పరిధిలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఈనెల 9 నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందని ఆర్ఎం కె.జాన్ రెడ్డి తెలిపారు. మొత్తం 298 ప్రత్యేక బస్సులు నడుస్తాయని చెప్పారు. నల్గొండ 36, మిర్యాలగూడ 44, దేవరకొండ 62, నార్కట్‌పల్లి 42, సూర్యాపేట 28, కోదాడ 42, యాదగిరిగుట్టకు 44 బస్సులు కేటాయించినట్లు తెలిపారు. రద్దీని బట్టి మరిన్ని బస్సు సర్వీసులను పెంచుతామని ఆయన పేర్కొన్నారు.
Similar News
News February 19, 2026
చిత్తూరు: అక్కడ మధ్యాహ్నం వరకే స్కూల్స్..

రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ప్రభుత్వ ఉర్దూ పాఠశాలల పనివేళల్లో సవరణ చేస్తున్నట్లు డీఈవో రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. జిల్లాలోని అన్ని ఉర్దూ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయన్నారు. ఉపాధ్యాయులు రంజాన్ మాసంలో ప్రతి రోజూ సాధారణ సమయం కంటే ఒక గంట ముందుగా ఇంటికి వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని ఆయన వెల్లడించారు.
News February 19, 2026
ఇంటర్వ్యూతో IICTలో ఉద్యోగాలు

<
News February 19, 2026
BREAKING: రాష్ట్రంలో భూకంపం

AP: పల్నాడు జిల్లాలో తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. వినుకొండకు 20km దూరంలో, భూమికి 10km లోతులో కేంద్రం ఉన్నట్లు EMSC, NCS ధ్రువీకరించాయి. వినుకొండ, దర్శి ప్రాంతాల్లోనూ ప్రకంపనల వల్ల వస్తువులు కదిలి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. అయితే, రాబోయే రోజుల్లో మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు.


