News March 16, 2025

నల్గొండ: ఇంటర్మీడియట్ పరీక్షలకు 312 మంది గైర్హాజరు

image

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీఐఈఓ దస్రూ నాయక్ తెలిపారు. శనివారం జరిగిన ద్వితీయ సంవత్సరం మ్యాథ్స్ బీ, జువాలజీ, హిస్టరీ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు నల్గొండ జిల్లాలో 11,888 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 11,576 మంది హాజరయ్యారు. 312 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారని డీఐఈఓ వెల్లడించారు. 

Similar News

News March 16, 2025

NLG: డ్రైవింగ్ కోర్సుకు దరఖాస్తు ఆహ్వానం

image

మోటార్ డ్రైవింగ్ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు BC సంక్షేమ అధికారి నజీం అలీ తెలిపారు. HYD హకీం పేటలో హెవీ మోటార్, లైట్ మోటర్ డ్రైవింగ్ నేర్పుతామన్నారు. 38 రోజులపాటు ఉచిత తర్వాత అర్హత ఉన్నవారికి ఉచితంగా పర్మినెంట్ లైసెన్స్ ఇస్తారని తెలిపారు. 8వ తరగతి ఉత్తీర్ణులైన వారు ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News March 16, 2025

NLG: మండలానికి మరో రెండు రైతు నేస్తం కేంద్రాలు!

image

రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా రైతు నేస్తం కేంద్రాలను పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఉమ్మడి NLG జిల్లాలో 315 రైతు వేదికల్లో 77 రైతు నేస్తం కేంద్రాలని నిర్వహిస్తోంది. మండలానికి మరో రెండు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రతినెల నిధులు మంజూరు చేసి రైతులకు మరింత పరిజ్ఞానం అందించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

News March 16, 2025

నల్గొండ: DCCలకు పదవులు.. అధ్యక్ష పీఠంపై ఇంట్రస్ట్

image

డీసీసీ పదవికి భారీగా డిమాండ్ పెరిగింది. నల్గొండ DCCగా ఉన్న శంకర్ నాయక్‌కు ఎమ్మెల్సీగా అవకాశం దక్కడంతో ఆ పదవికి పలువురు పోటీ పడుతున్నారు. సూర్యాపేట డీసీసీగా ఉన్న వెంకన్నను రైతు కమిషన్ సభ్యుడిగా నియమించింది. దీంతో ఇక్కడ కూడా డీసీసీ అధ్యక్ష పదవిపై పలువురి దృష్టి పడింది. సూర్యాపేట స్థానాన్ని జనరల్, యాదాద్రి జిల్లాకు ఎస్సీ లేదా జనరల్ కోటాలో భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు చర్చ నడుస్తోంది.

error: Content is protected !!