News March 18, 2025
నల్గొండ: ఇంటర్మీడియట్ పరీక్షలో 675 మంది విద్యార్థుల గైర్హాజరు

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీఐఈవో దశ్రు నాయక్ తెలిపారు. సోమవారం ఫిజిక్స్ వన్, ఎకనామిక్స్ వన్ పరీక్షలు జరిగాయని చెప్పారు. 15,316 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 14,641 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 675 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారని తెలిపారు.
Similar News
News March 18, 2025
GOVT జాబ్ కొట్టిన నల్గొండ జిల్లా బిడ్డ

టీజీపీఎస్సీ ఇటీవల వెల్లడించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాల్లో నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రానికి చెందిన పొనుగోటి మాధవరావు కుమారుడు హరీశ్ సత్తా చాటారు. 300 మార్కులకు గాను 199.16 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 121, జోన్ స్థాయిలో 37వ ర్యాంక్ సాధించి వార్డెన్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా హరీశ్‌కు కుటుంబ సభ్యులతో పాటు పలువురు అభినందనలు తెలిపారు.
News March 18, 2025
నల్గొండ: ఎల్ఆర్ఎస్ 25% రిబేట్‌కు స్పందన

రాష్ట్ర ప్రభుత్వం ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం ఈనెల 31లోగా ఎల్ఆర్ఎస్ చెల్లించిన వారికి ప్రకటించిన 25% రిబెట్ పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ మేరకు సోమవారం నల్గొండ మున్సిపల్ పరిధిలో 4 లబ్ధిదారులు ఎల్ఆర్ఎస్ చెల్లించి 25% రిబేటు పొందారు. ఇందుకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అందజేశారు.
News March 18, 2025
నల్గొండ: ప్రతి గ్రామానికి ఒక పోలీస్ అధికారి: SP

జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి, ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రతి గ్రామానికి ఒక పోలీస్ అధికారిని నియమిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. సోమవారం పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రతి గ్రామంలో వీపీవో క్రమం తప్పకుండా సందర్శించి, ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యల పరిష్కార దిశగా కృషి చేయాలని సూచించారు.