News April 18, 2025
నల్గొండ: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన యువతి అప్పగింత

మనస్తాపంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన యువతి తిరిగిరావడంతో ఆమెను పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరోసారి ఇలాంటి పొరపాటు చేయవద్దని తల్లీ కూతుర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్లు 2 టౌన్ ఎస్ఐ సైదులు తెలిపారు. నల్గొండ శివాజీ నగర్ ఏరియాలోని ఎన్జీ కాలనీకి చెందిన ఓ యువతి ఉద్యోగం చేయడానికి కుటుంబ సభ్యులు నిరాకరిస్తే మనస్తాపం చెంది మార్చి 1న ఇంటి నుంచి వెళ్లిపోయింది. పోలీసులు ఆమెను తిరిగి అప్పగించారు.
Similar News
News July 6, 2025
NLG: ‘భూభారతి.. ఎలాంటి ఓటీపీలు అడగడం జరగదు’

భూ సమస్యల పరిష్కార విషయంలో ప్రభుత్వం రైతులను ఎలాంటి ఓటీపీ అడగడం జరగదని, అసలు ఓటీపీ సమస్యే రాదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. Way2News ఇవాళ ప్రచురితమైన వార్తకు కలెక్టర్ స్పందించారు. తహశీల్దార్ స్థాయిలోనే సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ వివరించారు. అందువల్ల రైతులు ఎవరు ఈ విషయాలను నమ్మవద్దని ఆమె స్పష్టం చేశారు.
News July 6, 2025
NLG: విద్యాశాఖ సతమతం.. రెగ్యులర్ ఎంఈఓలు ఎక్కడ!?

జిల్లా విద్యాశాఖలో సిబ్బంది కొరత వేధిస్తుంది. జిల్లాలోని అన్ని మండలాలకు రెగ్యులర్ ఎంఈఓలు లేక ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న హెచ్ఎంలనే ఇన్చార్జ్ ఎంఈవోలుగా నియమించారు. దీంతో ప్రభుత్వ విద్య కుంటుపడుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. పని ఒత్తిడితో ఇంచార్జ్ ఎంఈఓలు సతమతమవుతున్నట్లు తెలుస్తుంది. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది.
News July 6, 2025
NLG: రేపటి వరకు అభ్యంతరాల స్వీకరణ

KGBVలో ప్రత్యేక అధికారులు, PGCRTలు, CRTలు, పీఈటీలు, ఏఎన్ఎం, అకౌంటెంట్ పోస్టులతో పాటు అదేవిధంగా టీజీ MSGHలో ఖాళీగా ఉన్న పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు డీఈవో భిక్షపతి తెలిపారు. అభ్యంతరాలు ఉంటే ఆధారాలతో ఈ నెల 7వ తేదీ వరకు ఫిర్యాదులు చేయాలని ఒక ప్రకటనలో తెలిపారు. 1:1 నిష్పత్తిలో సబ్జెక్టుల వారీగా అభ్యర్థులు జాబితాను డీఈవో వెబ్సైట్లో పొందు పరిచామని తెలిపారు.