News October 20, 2025

నల్గొండ: ఇద్దరు బిడ్డలను చంపి తల్లి సూసైడ్

image

కొండమల్లేపల్లిలో దారుణం జరిగింది. భార్యాభర్తల గొడవలతో మనస్తాపం చెందిన నాగలక్ష్మి (27) తన ఇద్దరు బిడ్డలు భవన్ సాయి (7), అవంతిక (9)ను హతమార్చి అనంతరం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో కొండమల్లేపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 20, 2025

HYD: బాలుడి చేతిలో బ్యాగ్.. అందులో బుల్లెట్

image

ప్రగతినగర్‌లో తల్లితో ఉంటున్న ఓ బాలుడు (12)ఇంట్లో ఉండటం ఇష్టం లేక మూసాపేట మెట్రో స్టేషన్‌కు బ్యాగుతో వచ్చాడు. సిబ్బంది తనిఖీ చేయగా షాక్‌కు గురయ్యారు. అందులో 9MM బుల్లెట్ బయటపడటంతో మెట్రో స్టేషన్ ఇన్‌ఛార్జికి చెప్పారు. కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. గతంలో బాలుడి తాత మిలిటరీలో పనిచేసి బుల్లెట్ ఇంట్లో ఉంచగా తెచ్చుకున్నాడని తేలింది. కేసు నమోదు చేసినట్లు SI గిరీష్ తెలిపారు.

News October 20, 2025

కందుకూరు మాజీ ఎమ్మెల్యేకు అవమానం!

image

గుడ్లూరు మండలం దారకానిపాడు హత్య ఘటనను పరామర్శించేందుకు వెళ్లిన కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివి శివరాంకు ఘోర అవమానం జరిగింది. పాత్రికేయుల సమావేశం సమయంలో ఆయనకు కుర్చీ కూడా ఇవ్వలేదు. సీనియర్ నాయకుడు నిలబడే పరిస్థితి రావడం నేతల్లో తీవ్ర అసంతృప్తి కలిగించింది. ఈ ఘటనపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పార్టీ నాయకులు దివి శివరాం పట్ల తగిన గౌరవం చూపలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News October 20, 2025

GWL: పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మెగా రక్తదాన శిబిరం: SP

image

పోలీస్ అమరవీరుల సంస్కరణ దినాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో పోలీస్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఉంటుందని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు సోమవారం పేర్కొన్నారు. అనంతరం మెగా రక్తదాన శిబిరం ఓపెన్ హౌస్ కార్యక్రమం ఉంటుందన్నారు. ఉదయం 8:30కి కలెక్టర్, ప్రజా ప్రతినిధులు, అన్ని శాఖల జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించాలన్నారు.