News March 18, 2025

నల్గొండ: ఇఫ్తార్ విందుకు ఫండ్స్ రిలీజ్

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాలకు ప్రభుత్వం ఇఫ్తార్ విందుకు నిధులు విడుదల చేసింది. నియోజకవర్గాల వారీగా నిధులు (రూ.లక్షలలో) నల్గొండ-5, మిర్యాలగూడ-4, దేవరకొండ-3, సాగర్-3,నకిరేకల్-3, మునుగోడు-3, కోదాడ-4, సూర్యాపట-3, హుజూర్ నగర్-3, తుంగతుర్తి-3, భువనగిరి-3, ఆలేరు-2 లక్షలు నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News March 18, 2025

‘X’ వేదికగా రామ్మూర్తి నాయుడుకు సీఎం నివాళులు

image

‘X’ వేదికగా సోదరుడు రామ్మూర్తి నాయుడుకు సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం ఘన నివాళులు అర్పించారు. తన కుటుంబంలోనే కాకుండా ప్రజాక్షేత్రంలో రామ్మూర్తి నాయుడుకు ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు. అందుకే ఆయన భౌతికంగా దూరమైనా జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయని తెలిపారు. ఆయన స్మృతికి మరొక్క మారు నివాళి అర్పిస్తున్నట్లు చెప్పారు.

News March 18, 2025

హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాల్లో సత్తాచాటిన నర్మాల మహిళ

image

గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన పి.లావణ్య హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జోన్-3 ఉమెన్స్‌లో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. లావణ్య ఎంఎస్సీ బీఈడీ పూర్తిచేసి కేజీబీవీలో కాంట్రాక్టు ఉద్యోగం చేస్తోంది. గ్రూప్4లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించింది. ఉద్యోగం చేస్తూనే హాస్టల్ వెల్ఫేర్ జాబ్‌కు ప్రిపేరై జాబ్‌ కొట్టింది.

News March 18, 2025

జపాన్‌లో ‘దేవర’ స్పెషల్ షోకు అనూహ్య స్పందన

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ సినిమా జపాన్ ప్రేక్షకులను అబ్బురపరిచింది. ఈనెల 28న జపాన్‌లో ‘దేవర’ రిలీజ్ కానుండగా మేకర్స్ స్పెషల్ షోను ఏర్పాటు చేశారు. దీనికి భారీగా ప్రేక్షకులు తరలివచ్చారు. మూవీ అద్భుతంగా ఉందంటూ వారు SMలో పోస్టులు పెడుతున్నారు. కాగా, ప్రమోషన్ల కోసం ఎన్టీఆర్, మేకర్స్ ఈనెల 22న జపాన్‌కు వెళ్లనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి.

error: Content is protected !!