News August 13, 2025

నల్గొండ: ఉద్యోగాల పేరిట మోసం.. నిందితులకు రిమాండ్

image

ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు శాలిగౌరారం సీఐ కొండల్ రెడ్డి తెలిపారు. విశాఖపట్నంకు చెందిన సాయిరామ జగదీష్, మహేష్, సురేష్‌‌ను అరెస్టు చేసి నకిరేకల్ జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, వారికి రిమాండ్ విధించారు. దీంతో వారిని నల్గొండ జైలుకు తరలించినట్లు సీఐ చెప్పారు.

Similar News

News September 9, 2025

NLG: ప్రజావాణిలో ఈ ఫిర్యాదులే అధికం..!

image

కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి కిటకిటలాడింది. తమ గోడును చెప్పుకునేందుకు వందల సంఖ్యలో బాధితులు తరలివచ్చారు. మండలాల్లో గ్రీవెన్స్ డే ఉన్నా, తమ సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ ప్రజలు నేరుగా కలెక్టరేట్‌కు వచ్చారు. సోమవారం 87 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో అధికశాతం భూ సమస్యలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినవే ఉన్నాయి. బాధితుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.

News September 9, 2025

నల్గొండలో న్యాయవాదుల విధులు బహిష్కరణ

image

నల్లగొండ జిల్లాలో న్యాయవాది వెంకటయ్యపై జరిగిన దాడిని ఖండిస్తూ జిల్లా కేంద్రంలోని కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, న్యాయవాదులకు పూర్తిస్థాయి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నిరసనతో కోర్టు కార్యకలాపాలు స్తంభించాయి.

News September 9, 2025

NLG: తుది ఓటరు జాబితా విడుదలకు కసరత్తు!

image

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తుది ఓటరు జాబితాను బుధవారం విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో మొత్తం 33 మండలాల్లో 33 జడ్పీటీసీ, 353 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశారు. ముసాయిదా ఓటరు జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని అధికారులు సూచించారు.