News January 16, 2026
నల్గొండ: ఉద్యోగాల పేరిట రూ.85 లక్షల మోసం

విదేశాల్లో చదువు, ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న గుంటూరుకు చెందిన ముప్పాళ్ల లీలాకృష్ణను చింతపల్లి పోలీసులు అరెస్ట్ చేసినట్లు అడిషనల్ డీఎస్పీ రమేశ్ తెలిపారు. పోలేపల్లికి చెందిన కరుణభాయ్ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టి, నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడి నుంచి ల్యాప్‌టాప్, మూడు ఫోన్లు, డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.85 లక్షల మేర మోసం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
Similar News
News February 21, 2026
వాసుదేవరెడ్డికి ఈ నెల 27 వరకు రిమాండ్

AP: లిక్కర్ స్కామ్ కేసు నిందితుడు <<19203084>>వాసుదేవరెడ్డికి<<>> విజయవాడ ACB కోర్టు ఈ నెల 27వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను గుంటూరు జైలుకు తరలించనున్నారు. అంతకుముందు కోర్టులో విచారణ సందర్భంగా సిట్ విచారణకు వాసుదేవరెడ్డి సహకరిస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. అప్రూవర్‌గా మారారని, అత్యవసరంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని వాదించారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉందని చెప్పారు.
News February 21, 2026
WGL: ఇసుక దందా అడ్డుకట్టకు చెక్ పోస్టులు..!

వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు మళ్లీ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. గత కొన్ని నెలల నుంచి సక్రమంగానే ఇసుక రవాణాకు సహకరించిన పోలీసులు అకస్మాత్తుగా చెక్ పోస్టులు పెట్టడంపై చర్చ జరుగుతోంది. ఇటీవల ఐనవోలు మండలం నందనంలో జడ్పీ మాజీ వైస్ ఛైర్మన్‌పై దాడి, ఓ ప్రజాప్రతినిధి మామూళ్ల వసూళ్లపై సీరియస్‌గా చర్చ జరగడంతో ఈ అడ్డుకట్ట వేస్తున్నట్లు తెలుస్తోంది.
News February 21, 2026
రావులపాడు కాలువలో మృతదేహం కలకలం

రావులపాడు వద్ద బొబ్బర్లంక ముక్కామల ప్రధాన పంట కాలువలో సుమారు 50–55 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం శనివారం లభ్యమైంది. స్థానిక వీఆర్వో ఇచ్చిన సమాచారంతో రావులపాలెం టౌన్ ఎస్సై రమణారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుని వివరాలు తెలిసిన వారు వెంటనే పోలీసులను సంప్రదించాలని ఎస్సై కోరారు.


