News March 26, 2024
నల్గొండ: ఉపాధి హామీ కూలీలకు తీపి కబురు

ఉపాధి హామీ కూలీలకు కేంద్రం తీపి కబురు చెప్పింది. ప్రస్తుతం అందిస్తున్న దినసరి కూలీని పెంచుతున్నట్లు పేర్కొంది. దీంతో ఉమ్మడి జిల్లాలో 7.52 లక్షల కార్డుదారులకు లబ్ధి చేకూరనుంది. 2005లో కేంద్రం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రారంభించిన సమయంలో దినసరి కూలీ రూ.87.50 ఉండగా.. ప్రస్తుతం రూ.272 చెల్లిస్తున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త కూలీ అమల్లోకి రానుంది.
Similar News
News July 7, 2025
NLG: సగం అంగన్వాడీ కేంద్రాలకే సొంత భవనాలు!

జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు అరకొర సౌకర్యాలతోనే నడుస్తున్నాయి. సగం కేంద్రాలకు సొంత భవనాలు లేవు. కొన్ని చోట్ల మంజూరైనా నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. చిన్నారులకు పౌష్టికాహారం, గర్భిణీలు, బాలింతలకు ఆరోగ్య సేవలు అందించే ఈ కేంద్రాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఇక అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక కొందరు తల్లిదండ్రులు తమ చిన్నారులను ఆయా కేంద్రాలకు పంపించడం లేదు.
News July 7, 2025
నల్గొండ జిల్లాలో 5వేలకు పైగానే రేషన్ కార్డులు కట్!

జిల్లాలో రేషన్ కార్డుల్లో అనర్హుల ఏరివేతకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వరుసగా ఆరు నెలలపాటు బియ్యం తీసుకొని కార్డులు రద్దు కానున్నట్లు సమాచారం. జిల్లాలో ప్రస్తుతం 4,78,216 రేషన్ కార్డులు ఉన్నాయి. కాగా జిల్లాలో 5,092 కార్డుదారులు ఆరు మాసాల నుంచి బియ్యం తీసుకోవడం లేదని తేల్చి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో వారిని అనర్హులుగా ప్రకటించి కార్డులు తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
News July 7, 2025
NLG: ఉచిత శిక్షణ దరఖాస్తులకు నేడే ఆఖరు

ఎస్సీ, స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికిగాను సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి బి. శశికళ తెలిపారు. డిగ్రీ ఉతీర్ణులైన SC, ST, BC (BCE, PWD) కులాలకు చెందిన ఆసక్తి గల అభ్యర్థులు www.tsstudycircle.co.in వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 7లోగా దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. 13న రాత పరీక్ష ఉంటుందన్నారు.