News January 9, 2026

నల్గొండ: ఊసే లేని రూ.12 వేల ఆర్థిక సాయం!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఆరంభ శూరత్వంగానే మిగిలిపోయింది. పథకాలు ప్రారంభించడమే తప్ప కాంగ్రెస్ అమలు చేయడం లేదంటూ సర్కార్ తీరుపై కూలీలు మండిపడుతున్నారు. భూమిలేని ఉపాధి హామీ రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు ఇస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రజాపాలన గ్రామ సభల్లో NLG నుంచి 15,485, సూర్యాపేటలో 22,186, యాదాద్రిలో 11,551 మంది దరఖాస్తు చేసుకున్నారు.

Similar News

News January 11, 2026

జగిత్యాల: అక్షరాయుధంతో ఎదిరించిన అలిశెట్టి!

image

తెలంగాణ నేల గర్వించదగ్గ మహాకవి అలిశెట్టి ప్రభాకర్. <<18824184>>జగిత్యాల<<>> జిల్లాలో జన్మించిన ఆయన, అక్షరాన్నే ఆయుధంగా మలచుకుని సామాజిక అన్యాయాలపై పోరాడారు. ‘సిటీ లైఫ్’ పేరుతో HYD జనజీవనాన్ని తన కవితల్లో కళ్లకు కట్టారు. చిత్రకారుడిగా ప్రస్థానం మొదలుపెట్టి, మినీ కవితా ప్రక్రియలో మేటిగా నిలిచారు. పేదరికం, అనారోగ్యంతో పోరాడుతూనే చివరి శ్వాసవరకు కలం వీడలేదు. నేడు ఆయన సాహిత్యం భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

News January 11, 2026

జగిత్యాల: అరుదైన కవి.. జయంతి, వర్ధంతి ఒకే రోజు!

image

నిర్భాగ్యుల గొంతుకైన కవి, తెలంగాణ శ్రీశ్రీగా పేరుగాంచిన జగిత్యాలకు చెందిన దివంగత అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి జనవరి 12 (1954–1993)ఒకే రోజు కావడం విశేషం. వృత్తి ఫొటో గ్రాఫర్. ప్రవృత్తి కవిగా సిటీలైఫ్, పరిష్కారం, వేశ్య, దృశ్యం, నిర్మొహమాటం, ఎర్రపావురాలు, రక్తరేఖ, కాలం గొలుసు, చురకలు వంటి అక్షర తూటాలను సమాజంపై సంధించిన ప్రభాకర్ తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక పేజీని సృష్టించుకుని పదిలపరుచుకున్నారు.

News January 11, 2026

ప.గో: వారికి ‘బిరులు’… వీరికి ‘సిరులు’!

image

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పందాల జోరు మొదలైంది. నిర్వాహకులు బిరుల (పందెం బరి) ఏర్పాటులో నిమగ్నమవగా, ఖాకీలు, ఖద్దరు నేతలకు ఇది కాసుల వర్షం కురిపిస్తోంది. పందెం మొత్తంలో 5 నుంచి 10 శాతం వాటా లేదా రోజువారీ మామూళ్ల కోసం పోలీస్ స్టేషన్లలో బేరాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. పండుగ 3రోజులకు ముందే ముడుపులు చెల్లించాలని కొందరు, రోజువారీ ఫీజు కట్టాలని మరికొందరు నిర్వాహకులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.