News February 7, 2025

నల్గొండ: ఎమ్మెల్సీగా ఆర్వ స్వాతి నామినేషన్ దాఖలు

image

నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మహిళా అభ్యర్థిగా మాజీ సర్పంచ్ అర్వ స్వాతి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి నామినేషన్ పత్రాలు అందజేశారు. నిడమనూరు మండలం వేం పహాడ్ గ్రామ మాజీ సర్పంచ్‌గా ఆమె పని చేశారు. కాగా గతంలో ఉత్తమ గ్రామ అవార్డు పొందారు. ఉపాధ్యాయుల సమస్యల పట్ల పోరాడుతానని ఆమె హామీ ఇచ్చారు.

Similar News

News February 7, 2025

రోడ్డు ప్రమాదంలో నల్గొండ యువకుడు మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా న్యూ టౌన్‌లో జరిగింది. స్థానికుల వివరాలు.. నారాయణపేట జిల్లాకు చెందిన శశాంక్ (19) నల్గొండకు చెందిన జ్ఞానేశ్వర్ (18) పట్టణంలోని మెడికల్ కాలేజీలో బీఎస్సీ చదువుతున్నారు. గురువారం బైక్‌పై వెళుతున్న ఇద్దరూ ఆగి ఉన్న లారీని ఢీకొట్టగా తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News February 7, 2025

గుర్రంపోడు: ఉరేసుకొని వ్యక్తి సూసైడ్

image

ఉరేసుకొని వ్యక్తం ఆత్మహత్య చేసుకున్న ఘటన గుర్రంపోడు మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మధు వివరాల ప్రకారం.. పిట్టలగూడెం గ్రామానికి చెందిన బైరి పవన్(18) డీజె సిస్టం ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి కుటుంబీకులతో కలిసి నిద్రించాడు. కాగా శుక్రవారం లేచి చూసేసరికి ఇంట్లో ఉరేసుకొని మృతి చెందినట్లు కుటుంబీకులు గుర్తించినట్లు ఎస్ఐ వెల్లడించారు.

News February 7, 2025

పేదలకు మైరుగైన వైద్యం అందించాలి: ఇలా త్రిపాఠి 

image

నల్గొండ సమీపంలోని రాములబండ తండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ప్రసవాలతోపాటు పేద ప్రజలకు ఇంకా మంచి వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. గురువారం ఆమె రాములబండ తండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రిజిస్టర్లను, సౌకర్యాలను పరిశీలించారు.

error: Content is protected !!