News June 18, 2024
నల్గొండ ఎస్పీగా మాజీ ఎమ్మెల్యే అల్లుడు

యాంటి నార్కోటిక్ బ్యూరో ఇన్‌ఛార్జిగా పని చేస్తున్న శరత్‌చంద్ర పవార్‌ను నల్గొండ జిల్లా ఎస్పీగా ప్రభుత్వం నియమించింది. ఈయన ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ అల్లుడు. 2016 ఐపీఎస్ బ్యాచ్‌లో ఎంపికై మొదటిసారి ములుగు జిల్లా ఏటూరునాగారం ఏఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా, HYD సెంట్రల్ జోన్ ఇన్‌ఛార్జిగా పనిచేసిన అనుభవం ఉంది. అటు సూర్యాపేట ఎస్పీగా సన్‌ప్రీత్ సింగ్‌ను నియమించింది.
Similar News
News April 15, 2026
ఎండిపోతున్న కృష్ణమ్మ: డెడ్ స్టోరేజీకి నాగార్జునసాగర్

తెలుగు రాష్ట్రాల వరప్రదాయని నాగార్జునసాగర్ జలాశయం నీటి కొరతతో వెలవెలబోతోంది. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో సాగు, తాగునీటి సరఫరాపై నీలినీడలు కమ్ముకున్నాయి. లక్షల ఎకరాల ఆయకట్టు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి కూడా నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. కృష్ణా బేసిన్ అంతటా నీటి మట్టాలు కనిష్ట స్థాయికి పడిపోయాయి.
News April 15, 2026
నాగార్జునసాగర్ మీదుగా 12 లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే

హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి బందరు పోర్టు వరకు నాగార్జునసాగర్ నియోజకవర్గం మీదుగా 12 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేకు ప్రాథమిక అలైన్‌మెంట్ సిద్ధమైంది. ఈ మార్గం 2 రాష్ట్రాలు, 5 జిల్లాలు, 100 గ్రామాల మీదుగా 297 కి.మీ. పొడవున సాగుతుంది. తెలంగాణలో 40, ఏపీలో 60 గ్రామాలు పరిధిలోకి వస్తాయి. డీపీఆర్ కోసం కన్సల్టెంట్ల ఎంపిక జరుగుతుండగా, డిసెంబరు నాటికి పూర్తి అలైన్‌మెంట్ ఖరారయ్యే అవకాశ ఉందని అధికారుల అంచనా.