News March 23, 2026

నల్గొండ: ఎస్సీ యాక్షన్ ప్లాన్ పథకాలను సద్వినియోగం చేసుకోండి!

image

జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం ద్వారా 2025-26 ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద అమలవుతున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో హిమబిందు కోరారు. ఈ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 24వ తేదీని చివరి గడువుగా నిర్ణయించినట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు అవసరమైన పత్రాలతో నల్గొండలోని ఎస్సీ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

Similar News

News April 13, 2026

నల్గొండ: ధాన్యం కుప్పలతో బైక్ స్కిడ్.. ఒకరి మృతి

image

మాటూరు గ్రామ పరిధిలో రోడ్డుపై ఆరబోసిన ధాన్యం కుప్పల వల్ల జరిగిన ప్రమాదంలో అడవిదేవులపల్లికి చెందిన భద్రయ్య మృతి చెందారు. మిర్యాలగూడ – అడవిదేవులపల్లి రహదారిపై ధాన్యం పట్టాల వల్ల బైక్ అదుపుతప్పడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. భద్రయ్య మృతితో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. రోడ్లపై ధాన్యం ఆరబోయకుండా నిరోధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

News April 13, 2026

నాగార్జునసాగర్ డ్యాం స్పిల్‌వే పరిశీలన

image

నాగార్జునసాగర్ డ్యాం స్పిల్‌వేను కేంద్ర డ్యాం సేఫ్టీ బృందం ఛైర్మన్ శర్మ ఆధ్వర్యంలో పరిశీలించింది. స్పిల్‌వేపై ఏర్పడిన గుంతలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, భద్రతా ప్రమాణాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. బకెట్ పోర్షన్‌లో నీరు ఉండటంతో కొంత ఇబ్బంది ఎదురైనప్పటికీ, ప్రాజెక్టు రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై కీలక సూచనలు చేశారు. ఈ పర్యటనలో సత్యనారాజ్, గౌతమ్ పాల్గొన్నారు.

News April 13, 2026

NLG: అంగన్‌వాడీలో చిన్నారులకు డ్రెస్‌కోడ్..!

image

అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుకునే చిన్నారుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యాసంవత్సరం నుంచి చిన్నారులకు ప్రత్యేక డ్రెస్‌కోడ్‌ను అమలు చేయనున్నట్లు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కృష్ణవేణి తెలిపారు. జిల్లావ్యాప్తంగా 9 ప్రాజెక్టుల పరిధిలో 2093 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. 45,543 మంది చిన్నారులకు త్వరలో దుస్తులు పంపిణీ చేస్తామన్నారు.