News December 11, 2025
నల్గొండ: ఓటేద్దాం.. చలో చలో!

ఉమ్మడి NLG జిల్లాలో మొదటి విడత GP ఎన్నికలు నేడు జరగనున్నాయి. ఓటరు మహాశయులారా ఇక సిద్ధమవ్వండి. మీరు ఎక్కడున్నా సరే సొంతూరులో ఓటు హక్కు ఉంటే తప్పకుండా వచ్చి ఓటేయండి. 3జిల్లాల పరిధిలోని 630 పంచాయతీల్లో 45 GPలు ఏకగ్రీవం కాగా 585 స్థానాల్లో 858 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక 4,776 వార్డు స్థానాలకు 11,367 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
> GP ఎన్నికల అప్‌డేట్స్ కోసం Way2Newsను ఫాలో అవ్వండి.
Similar News
News December 12, 2025
పంచాయతీ ఎన్నికల్లో 84.28% ఓటింగ్

TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 84.28% పోలింగ్ నమోదైంది. 53.57లక్షల ఓటర్లకు గానూ 45.15లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 92.88%, అత్యల్పంగా భద్రాద్రి జిల్లాలో 71.79% ఓటింగ్ నమోదైంది. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లోనూ 90శాతం మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అర్ధరాత్రి వరకు 3,300 సర్పంచ్, 24,906 వార్డు స్థానాల్లో కౌంటింగ్ పూర్తైంది.
News December 12, 2025
కొబ్బరికాయకు కుంకుమ పెడుతున్నారా?

హిందూ సంప్రదాయంలో పూజలు, శుభకార్యాలప్పుడు కొబ్బరికాయ కొట్టడం ఆనవాయితీ. అయితే దేవుడికి నైవేద్యంగా సమర్పించే కొబ్బరిపై కుంకుమ బొట్టు పెట్టకూడదని పండితులు సూచిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం శుద్ధత అని, దేవుడికి సమర్పించే ప్రసాదం ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండాలని అంటున్నారు. తెల్లటి గుజ్జుపై కుంకుమ ఉంచడం వల్ల తినదగిన నైవేద్యం స్వచ్ఛత దెబ్బతింటుందని, కావాలంటే పీచుపై పెట్టాలని సూచిస్తున్నారు.
News December 12, 2025
టీడీపీలో చేరి కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా ఎన్నిక

కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా 15వ వార్డు కౌన్సిలర్ గౌతమి ఎన్నికైన విషయం తెలిసిందే. ఆమెకు ఆర్డీఓ, ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్ వసంత బాబు నియామక పత్రం అందజేశారు. గతంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన గౌతమి.. బుధవారం టీడీపీలో చేరారు. 24 మంది కౌన్సిలర్లకు గాను 22 మంది హాజరయ్యారు. ఇద్దరు గైరాజరయ్యారు. ఎక్స్ అఫీషియో సభ్యులిద్దరితో కలిపి 13 మంది గౌతమికి ఓటు వేయడంతో గెలుపొందారు.


