News February 8, 2025
నల్గొండ: కలెక్టరేట్‌లో పందులు..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738935260029_50383602-normal-WIFI.webp)
జిల్లాలోని కలెక్టరేట్ ఆవరణలో పందులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయ్. నిత్యం వివిధ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలకు ఇవి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కలెక్టరేట్‌లోనే ఈ పరిస్థితి ఉంటే ఇక మిగతా ప్రదేశాల్లో పందుల బెడద ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని ప్రజలు వాపోతున్నారు. దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
Similar News
News February 8, 2025
నల్గొండ: మాతా శిశుమరణాల రేటు తగ్గింపును సవాల్‌గా తీసుకోవాలి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738932391195_20447712-normal-WIFI.webp)
మాతా శిశుమరణాలను తగ్గించడాన్ని సవాల్‌గా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్‌లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఆశ కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించి అన్ని రంగాలలో మనిషి ముందుకెళ్తున్నప్పటికీ అవగాహన లోపం, మూఢ నమ్మకాలతో అక్కడక్కడా ఇంకా మాతా శిశు మరణాలు నమోదవుతున్నాయని అన్నారు.
News February 8, 2025
నల్గొండ: యువకుడి వేధింపులతో యువతి ఆత్మహత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738948714484_1248-normal-WIFI.webp)
మిర్యాలగూడ మండలం కొత్తగూడెంలో వాణి అనే యువతి బాత్రూంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సతీశ్ కొద్దిరోజులుగా వాణిని వేధిస్తున్నాడు. ఈ కారణంతోనే తమ బిడ్డ ఈ దారుణానికి ఒడిగట్టిందని కుటుంబీకులు తెలిపారు. దీంతో సతీశ్‌పై రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
News February 7, 2025
నల్గొండ: ఉచిత శిక్షణ.. ఆపై ఉద్యోగం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738929611410_50283763-normal-WIFI.webp)
స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో నిరుద్యోగ యువతీయువకులకు ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగం కల్పిస్తామని సంస్థ డైరెక్టర్ లక్ష్మీ ఓ ప్రకటనలో తెలిపారు. అకౌంట్స్ అసిస్టెంట్ (ట్యాలీ), కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్, ఆటోమొబైల్, టూ-వీలర్ సర్వీసింగ్, సెల్‌ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్, సోలార్ సిస్టం ఇన్స్టాలేషన్ కోర్సుల్లో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవచ్చని కోరారు.