News March 24, 2025

నల్గొండ కలెక్టరేట్ ప్రజావాణికి 100 దరఖాస్తులు

image

ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సోమవారం సుమారు 100 మంది సమస్యల పరిష్కారం నిమిత్తం దరఖాస్తులు సమర్పించారు. ఈ దరఖాస్తులలో ఏప్పటిలాగే వ్యక్తిగత సమస్యలు, భూ సమస్యలు, పెన్షన్ మంజూరి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై వచ్చాయి.

Similar News

News March 26, 2025

NLG: సన్న బియ్యం పంపిణీకి చకచకా ఏర్పాట్లు

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేషన్ కార్డుదారులకు ఏప్రిల్ 1 నుంచి సన్నబియ్యం ఇవ్వనున్నారు. ప్రస్తుతం డీలర్ల వద్ద నిల్వ ఉన్న దొడ్డుబియ్యం మొత్తం వెనక్కి పంపించాలని సర్కార్ ఆదేశించింది. ఈ మేరకు అవసరమైన చర్యలు ముమ్మరం చేసింది. ఇప్పటికే గోదాముల్లో బియ్యం సిద్ధంగా ఉంచిన అధికారులు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వాటిని రేషన్ షాపులకు తరలించి పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

News March 26, 2025

NLG: ధాన్యం కొనుగోళ్లకు కసరత్తు

image

నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతేడాది యాసంగిలో ఏప్రిల్ మొదటి వారం వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని రైతుల నుంచి విమర్శలు రాగా.. ఈసారి ఆ సమస్య రాకుండా ముందస్తుగానే జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తుంది. జిల్లాలో ఈ సీజన్లో 11.26 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా.. 12.14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేశారు.

News March 26, 2025

సీజన్ ముగిసిన.. రైతుకు దక్కని భరోసా!

image

నల్గొండ జిల్లాలో రైతు భరోసా కోసం రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. ఇప్పటివరకు యాసంగి సీజన్‌కు సంబంధించి మూడెకరాల లోపు 2, 76,694 మంది ఖాతాల్లో మాత్రమే ప్రభుత్వం నిధులు జమ చేసింది. మూడు ఎకరాలకు పైగా ఉన్న సుమారు 3. 30 లక్షల మంది రైతులు రైతు భరోసా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. సీజన్ ముగిసినా ఎప్పుడు ఇస్తారోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

error: Content is protected !!