News January 1, 2026

నల్గొండ కలెక్టర్ భూదాన్ పోచంపల్లి వాసి..!

image

నల్గొండ జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన బడుగు చంద్రశేఖర్ భూదాన్ పోచంపల్లి మండలం జిబ్లక్ పల్లి గ్రామ వాసి. చేనేత కుటుంబానికి చెందిన చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు 40 ఏళ్ల క్రితమే హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. వారి తండ్రి నరహరి ప్రస్తుతం హైదరాబాద్‌లో వస్త్ర వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తి నల్గొండ కలెక్టర్ అయ్యారు.

Similar News

News January 2, 2026

నదీ జలాల వివాద పరిష్కారానికి 3నెలల గడువు

image

AP, TGల మధ్య నదీ జలాల వివాదంపై ఏర్పాటు చేసిన <<18742119>>కమిటీకి<<>> కేంద్రం 3 నెలల గడువు విధించింది. నీటి నిర్వహణలో సమస్యలను సమగ్రంగా పరిష్కరించాలని సూచించింది. అపరిష్కృత అంశాలను అధ్యయనం చేసి సమాన నీటి భాగస్వామ్యం ఉండేలా సిఫార్సులు ఇవ్వాలంది. ఈ ప్రక్రియలో సంబంధిత విభాగాలను సమావేశాలకు రప్పించవచ్చని తెలిపింది. కాగా 2025 JUL 16న 2రాష్ట్రాల CMలతో నిర్వహించిన భేటీలో కమిటీ ఏర్పాటుకు నిర్ణయించింది.

News January 2, 2026

MBNR: TG TET.. బందోబస్తు ఏర్పాటు: SP

image

MBNR జిల్లాలో TG TET దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు SP డి.జానకి తెలిపారు. పరీక్ష రోజుల్లో ఉదయం 7:30 నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఐదుగురికి మించి గుంపులుగా ఉండరాదని, సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.

News January 2, 2026

ఇతిహాసాలు క్విజ్ – 115 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: రావణుడిని బంధించిన వానర రాజు ఎవరు? తన శక్తితో ఆ రాజు రావణుడిని ఏం చేశాడు?
సమాధానం: రావణుడిని బంధించిన వానర రాజు వాలి. రావణుడు తనను యుద్ధానికి ఆహ్వానించినప్పుడు ధ్యానంలో ఉన్న వాలి చంకలో నొక్కి పట్టుకున్నాడు. 6 నెలల పాటు బందీగా ఉంచుకుని, 4 సముద్రాల మీదుగా ఆకాశంలో విహరించాడు. వాలి బలం ముందు రావణుడి పప్పులు ఉడకలేదు. చివరికి రావణుడు తన ఓటమిని అంగీకరించాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>