News January 11, 2026

నల్గొండ ‘కార్పొరేషన్’.. గెజిట్‌ కోసం నిరీక్షణ!

image

నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మారుస్తూ శాసనసభ, మండలి ఆమోదించిన బిల్లు గవర్నర్ వద్ద ఉంది. దీనిపై గెజిట్ విడుదల కావాల్సి ఉండటంతో ఎన్నికల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే అధికారులు ఓటర్ల ముసాయిదా జాబితాను సిద్ధం చేసినప్పటికీ, తుది జాబితా ప్రదర్శనను ప్రస్తుతానికి నిలిపివేయాలని ఆదేశాలు అందినట్లు సమాచారం. గెజిట్ వెలువడితేనే 48 వార్డుల పునర్విభజన, మేయర్ పదవి రిజర్వేషన్లపై స్పష్టత రానుంది.

Similar News

News January 28, 2026

మున్సిపల్ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సహకరించాలి: కలెక్టర్

image

నల్గొండ కార్పొరేషన్‌తో పాటు ఆరు మున్సిపాలిటీల్లో శాంతియుత పోలింగ్‌కు రాజకీయ పక్షాలు సహకరించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ కోరారు. బుధవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 162 వార్డుల కోసం 475 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈసారి ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే జరుగుతాయని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News January 28, 2026

నామినేషన్ కేంద్రాల వద్ద భారీ భద్రత: ఎస్పీ శరత్ చంద్ర పవార్

image

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలోని నామినేషన్ కేంద్రాన్ని ఆయన స్వయంగా తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News January 28, 2026

నల్గొండ: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని హత్య

image

మాడుగులపల్లి మండలం సీత్యతండాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్య లక్ష్మి తన భర్త రవిని అతికిరాతంగా హతమార్చింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసుల విచారణలో లక్ష్మీ నేరాన్ని ఒప్పుకొని లొంగిపోయింది. అన్యోన్యంగా ఉన్న కుటుంబంలో ఈ దారుణం జరగడంతో తండాలో విషాద ఛాయలు అలముకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.