News September 17, 2024
నల్గొండ: కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు బ్రేక్

పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రుల్లో ప్రభుత్వం విరివిగా నిర్వహించే డబుల్ పంక్చర్ ల్యాప్రోస్కోపిక్ (DPL) కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు జిల్లాలో బ్రేక్ పడింది. రెండో బిడ్డ పుట్టి కుటుంబ నియంత్రణ కోసం జిల్లాలో సుమారు 70 వేల మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో కు.ని కోసం పెద్ద సంఖ్యలో మహిళలు ఎదురు చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడ కు.ని ఆపరేషన్లు జరగడం లేదు.
Similar News
News December 31, 2025
నల్గొండలో ‘నార్కోటిక్’ నిఘా

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నల్గొండలోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్ పరిసరాల్లో నార్కోటిక్స్ డాగ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన జాగిలాల సహాయంతో అనుమానిత బ్యాగులు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణాకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యమని, ఎవరైనా డ్రగ్స్ సరఫరా చేసినా, వినియోగించినా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
News December 31, 2025
NLG: కార్పొరేషన్ కలే.. ఈసారీ అంతే..!

NLG మునిసిపాలిటీ కార్పొరేషన్ అయ్యే కల సాకరమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. 2018 ఎన్నికలకు ముందు BRS ప్రభుత్వం NLGను మహానగరంగా చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అప్పట్లో 7 గ్రామాలను విలీనం చేయగా ఆ గ్రామాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. 3 నెలల క్రితం మళ్లీ ప్రతిపాదనలు చేసినా ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది.
News December 31, 2025
నల్గొండ: ‘ఆపరేషన్ చబుత్ర’తో పోలీసుల తనిఖీలు

నల్గొండ జిల్లాలో నేరాలు, రోడ్డు ప్రమాదాల అదుపునకు ఎస్పీ శరత్ చంద్ర పవార్ పర్యవేక్షణలో చేపట్టిన ‘ఆపరేషన్ చబుత్ర’ సత్ఫలితాలనిస్తోంది. 30 బృందాలతో చేపట్టిన విస్తృత తనిఖీల్లో డ్రంకెన్ డ్రైవ్ కింద 337 కేసులు నమోదు చేశారు. పట్టుబడిన 300 మంది యువకులకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. డిసెంబర్ 31 వరకు ఈ తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.


