News October 3, 2024
నల్గొండ: కూలిన చెట్లు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బుధవారం భారీ వర్షాలు కురిశాయి. సాయంత్రం మొదలైన వాన రాత్రి వరకూ కురిసింది. గాలి బీభత్సానికి కొన్ని చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కోదాడ నుంచి వాయిల సింగారం వెళ్లే రహదారిపై చెట్లు కూలి రోడ్డుపై అడ్డంగా పడ్డాయి..వైర్లు తెగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కోదాడ 4 గంటలపాటు అంధకారంలో మునిగింది.
Similar News
News December 28, 2025
నల్గొండ: కొండెక్కిన కోడి.. సామాన్యుడికి బెంబేలు

చికెన్, గుడ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కార్తీక మాసం ముగియడం, పెళ్లిళ్ల సీజన్ తోడవ్వడంతో గిరాకీ పెరిగింది. ఫలితంగా కిలో చికెన్ రూ.300 మార్కును తాకింది. గుడ్డు పదికి చేరువవుతోంది. మధ్యాహ్న భోజన పథకంలోనూ గుడ్డు కరవై విద్యార్థులు అల్లాడుతున్నారు. సంక్రాంతి నాటికి ధరలు మరింత సెగ పుట్టించేలా ఉన్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. వంటింట్లో ధరల మంటతో సామాన్యుడు విలవిలలాడుతున్నాడు.
News December 28, 2025
జిల్లా అధ్యక్షుడి తీరుపై అధిష్ఠానం సీరియస్..!

నల్డొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణపై పార్టీ అధిష్ఠానం స్పందించింది. వాజ్‌పేయి జయంతి వేడుకల్లో జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి సమక్షంలోనే నాయకుడు పిల్లి రామరాజుపై జరిగిన దాడిని రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనతో పార్టీ ప్రతిష్ఠ దెబ్బతిందని భావించిన రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు.. వర్షిత్‌రెడ్డిని పిలిపించి మందలించినట్లు తెలుస్తోంది.
News December 28, 2025
NLG: ముందుగానే మున్సి ‘పోల్స్’….!

మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది. కేంద్రం నుంచి మున్సిపాలిటీలకు వివిధ పథకాల కింద గ్రాంట్లు, కేంద్ర ఆర్థిక సంఘం నిధులను రాబట్టుకునేందుకే ఈ ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి జిల్లాలో 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఎప్పుడు షెడ్యూల్ వచ్చినా… ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తొంది.


