News July 19, 2024
నల్గొండ: కూల్ డ్రింక్ ఇచ్చి.. మహిళ మెడలో బంగారం చోరీ

మహిళ మెడలో పుస్తెలతాడు లాక్కెళ్లిన ఘటన పీఏ పల్లి మండల పరిధిలోని మల్లాపురంలో జరిగింది. గ్రామానికి చెందిన గన్నేబోయిన ముత్యాలమ్మ గ్రామ శివారులో పంట పొలంలో పనిచేస్తుంది. అక్కడికి బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి తెలిసిన వ్యక్తిలా పరిచయం చేసుకుని కూల్ డ్రింక్ తాగమని ఇచ్చాడు. డ్రింక్ తాగుతుండగా రాయితో ఆమె తలపై కొట్టి బంగారం లాక్కెళ్లినట్లు SI నర్సింహులు తెలిపారు.
Similar News
News August 18, 2025
NLG: ‘ఇందిరమ్మ’ లబ్ధిదారులకు రుణ సాయం!

ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే ఆర్థిక స్తోమత లేని లబ్ధిదారులకు ప్రభుత్వం బ్యాంకు రుణాలు అందజేస్తుంది. జిల్లాలో ఇప్పటికే 241 మందికి రూ.లక్ష చొప్పున రుణం అందజేశారు. కొందరు మహిళా సంఘాల్లో సభ్యులు కాకపోయినా వారిని సభ్యులుగా చేర్చి రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.
News August 18, 2025
NLG: రేపు డీఈఈ సెట్-25 స్పాట్ అడ్మిషన్లకు కౌన్సిలింగ్

డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సు 2025-27 బ్యాచ్‌లో మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఈ నెల 19న ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు నల్లగొండ ప్రభుత్వ డైట్ కాలేజీలో స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు కాలేజీ ప్రిన్సిపల్ కె.గిరిజ తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో కౌన్సిలింగ్ కు హాజరుకావాలని సూచించారు. మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తామన్నారు.
News August 17, 2025
NLG: ఆలస్యమైనా.. ఆశలు నింపాయి!

నల్గొండ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్గాలు ఆశలు నింపాయి. మొన్నటి వరకు అంతంత మాత్రమే పడడంతో సాగు, తాగునీటిపై కొంత భయం ఉండేది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఆ ఆందోళన అక్కర్లేదనే నమ్మకం ఏర్పడింది. గత కొన్ని రోజులుగా జిల్లా వ్యాప్తంగా మెరుగైన వర్షపాతం నమోదైంది. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. చెరువులు, కుంటలు నిండుతున్నాయి. మూసీ, శాలిగౌరారం ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.