News April 10, 2024
నల్గొండ: కొండెక్కిన చికెన్ ధరలు
రోజురోజుకూ కోడిమాంసం వెల కొండెక్కుతోంది. మొన్నటి వరకు కిలో రూ.200 పలికిన చికెన్ ధర నేడు రూ.294కు చేరింది. దీంతో దుకాణానికి వెళ్లిన వారు ధర అడిగి కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. కిలో తీసుకునే వారు ఇప్పుడు ధరను చూసి అరకిలో తోనే పరిమితమవుతున్నారు. మున్ముందు చికెన్ ధరలు రూ.300పైగా చేరుకునే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు.
Similar News
News January 6, 2025
భువనగిరి: KTRకు చామల కౌంటర్.. మీ కామెంట్?
రైతుభరోసాపై KTRట్వీట్‌కు భువనగిరి MP చామల కిరణ్ కౌంటర్ ఇచ్చారు. వరి వేస్తే ఉరి అన్న మీరెక్కడ..? అత్యధికం ధాన్యం కొనుగోలు చేసి చరిత్ర సృష్టించిన మేమెక్కడ..? అని మండిపడ్డారు. రాళ్లు రప్పలకు పెట్టుబడి పేరిట రూ.22 వేల కోట్లు మింగిన BRSతో మా కాంగ్రెస్‌కు పోలికా..? అని ధ్వజమెత్తారు. రైతు భరోసా రూ.12 వేలు, బోనస్ రూ.500 ఇచ్చి రైతులను ఆదుకుంటున్నామని X(ట్విట్టర్)లో పేర్కొన్నారు. MP వ్యాఖ్యలపై మీ కామెంట్..?
News January 6, 2025
ALERT.. NLG: మాంజాతో గొంతులు తెగుతున్నాయ్!
సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఆకాశంలో గాలిపటాలు ఎగురుతుంటాయ్. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎగరవేస్తుంటారు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కొందరు కైట్స్ ఎగరవేయడానికి చైనా మాంజా వాడుతుండటంతో రోడ్లపై వెళ్లే వారికి అవి ప్రమాదకరంగా మారాయి. గతంలో చైనా మాంజాతో గొంతులు తెగి ప్రాణాలు పోయిన సందర్భాలూ ఉన్నాయి. గత ఏడాది రామగిరికి చెందిన ఓ యువకుడికి మాంజా తగిలి చేతికి గాయమైన విషయం తెలిసిందే.
News January 6, 2025
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి : జిల్లా ఎస్పీ
సైబర్ నేరాల పై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. సైబర్ నేరగాళ్లు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పేరుతో పలు యాప్‌లు డౌన్లోడ్ చేయించి ప్రలోభ పెట్టి ప్రజల బ్యాంకు ఖాతా నుంచి నగదు దోచుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి ఘటన నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందన్నారు. ఈ కేసులో సైబర్ నేరగాళ్లు ఓ బాధితుడికి సుమారు 2కోట్లను మార్కెట్లో ఇన్‌వెస్ట్‌మెంట్ చేయించి మోసం చేశారన్నారు.