News August 22, 2025
నల్గొండ: కొత్తగా బియ్యం తీసుకోబోతున్నారు..!

సెప్టెంబర్ 1వ తేదీ నుంచి బియ్యం పంపిణీ జరగనుంది. నల్గొండ జిల్లాలో మొదటిసారి 44,099 కుటుంబాలు బియ్యం తీసుకోబోతున్నాయి. వారికి రేషన్‌తో పాటు ప్రభుత్వ పథకాలు అందనున్నాయి. ఏళ్లనాటి కల నెరవేరుతుండడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 991 రేషన్ దుకాణాలు ఉండగా గతంలో 89.15 లక్షల క్వింటాళ్ల బియ్యం కేటాయించారు. అది ఈసారి 94.04 లక్షల క్వింటాలుగా ఉండనుంది.
Similar News
News August 22, 2025
నల్గొండలో ‘మిషన్ RRR’ ప్రారంభం

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా, ‘మిషన్ RRR (Road Safety, Rules, Responsibilities)’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు భద్రతపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలు, వాహనదారులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
News August 22, 2025
NLG: విద్యాశాఖలో హాజరు శాతం మెరుగు..!

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు శాతం మెరుగైంది. ముఖ ఆధారిత హాజరు విధానం అమలుతో గైర్హాజరుకు చెక్ పడింది. గతంలో ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలకు రాకపోవడం, ఏవో సాకులు చూపి డుమ్మా కొట్టేవారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 1 నుంచి టీచర్లకు ముఖ గుర్తింపు హాజరును విద్యాశాఖ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతీ రోజు ఉదయం పాఠశాలకు రాగానే యాప్లో ఇన్, వదిలి వెళ్లే సమయంలో అవుట్ అని హాజరు నమోదు చేస్తున్నారు.
News August 22, 2025
NLG: హెచ్ఎంలుగా 52 మంది స్కూల్ అసిస్టెంట్లు..!

ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేసే స్కూల్ అసిస్టెంట్లకు సీనియార్టీ ప్రాతిపదికన హెడ్ మాస్టర్లుగా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు విద్యాశాఖ రీజినల్ డైరెక్టర్ పదోన్నతుల ఉత్తర్వులు గురువారం రాత్రి విడుదల చేశారు. పదోన్నతుల ప్రక్రియ గతనెలలోనే నిర్వహించారు. అయితే.. కోర్టు ఆదేశాలతో ఆ ప్రక్రియ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. జిల్లాలో 52 పోస్టులను పదోన్నతులతో నింపారు.