News January 2, 2026

నల్గొండ: క్షయ రహిత సమాజమే లక్ష్యం: డాక్టర్‌ కల్యాణ్‌ చక్రవర్తి

image

జిల్లా ఆసుపత్రిలోని పీఆర్‌టీ కేంద్రంలో అత్యాధునిక డిజిటల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్‌రే పరికరాన్ని అధికారులు ప్రారంభించారు. జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్‌ కళ్యాణ్‌ చక్రవర్తి మాట్లాడుతూ.. నెల రోజుల పాటు కొనసాగే ఈ ప్రత్యేక క్యాంపును ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. అత్యాధునిక సాంకేతికతతో క్షయ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించడం సులువవుతుందని పేర్కొన్నారు.

Similar News

News February 16, 2026

నల్గొండ: బందోబస్తు పరిశీలించిన ఎస్పీ శరత్ చంద్రపవార్

image

నల్గొండ జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు 6 మున్సిపాలిటీల్లో మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతమైన వాతావరణంలో విజయవంతంగా ముగిసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల ప్రక్రియను జరిపేందుకు పోలీస్ శాఖ తరఫున పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

News February 16, 2026

నల్గొండ: ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయంటే..

image

ఇటీవల జరిగిన ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన అధికారిక గణాంకాలు వెల్లడయ్యాయి. మొత్తం 2,40,514 ఓట్లు పోలవ్వగా, కాంగ్రెస్‌కు అత్యధికంగా 1,13,149 ఓట్లు దక్కాయి. బీఆర్ఎస్ 74,163 ఓట్లతో రెండో స్థానంలో నిలవగా, బీజేపీ 24,479 ఓట్లకు పరిమితమైంది. పట్టణ ప్రాంతాల్లోనూ బీజేపీ ప్రభావం చూపలేకపోయిందని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ భారీ మెజార్టీతో ముందంజలో ఉండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

News February 16, 2026

నల్గొండ: MIMలో చేరిన కార్పొరేటర్

image

నల్గొండ పురపాలక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 26వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ మొయినా భాయ్ హైదరాబాద్‌లో పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సమక్షంలో MIM తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల సమయంలో టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి 107 ఓట్ల మెజారిటీతో సంచలన విజయం సాధించిన ఆయన ఇప్పుడు తిరిగి పతంగి గూటికి చేరారు.