News October 30, 2025
నల్గొండ: ఖజానా ఉన్నా.. సుదీర్ఘ నిరీక్షణ

గుర్రంపోడు జీపీ భవన నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయింది. 8 సంవత్సరాల క్రితం నిధులు మంజూరైనప్పటికీ స్లాబ్ వరకు కట్టి అర్ధాంతరంగా వదిలేశారని గ్రామస్థులు ఆరోపించారు. అధికారులు, నాయకుల నిర్లక్ష్యంతో ఈ పరిస్థితి తలెత్తిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ధనాన్ని వృథా చేయకుండా ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మీ ప్రాంతంలో ఇలాంటి భవనాలున్నాయా..?
Similar News
News October 30, 2025
KNR: మొంథా తుఫాన్.. రైతన్నలకు మిగిల్చింది తడిసిన ధాన్యమే

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలకు రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. అధికారుల అంచనా ప్రకారం 2036 మెట్రిక్ టన్నుల ధాన్యం జిల్లాలో తడిసి ముద్దయినట్లు సమాచారం. చేతికి వచ్చిన పంట అమ్ముకునే సమయంలో వర్షాలు పడి పంట నష్టాన్ని కలిగించిందన రైతులు వాపోయారు. రైతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించే సాయమే మిగిలిందని రైతులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు.
News October 30, 2025
నవంబర్ 7న రెడ్ క్రాస్ జిల్లా మేనేజ్మెంట్ కమిటీ ఎన్నిక

నవంబర్ 7న రెడ్‌క్రాస్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు ఈ సమావేశం నిర్వహిస్తామన్నారు. జిల్లా రెడ్‌క్రాస్ శాఖలో సభ్యత్వం కలిగిన పేట్రాన్, వైస్ పేట్రాన్, లైఫ్ మెంబర్స్, లైఫ్ అసోసియేట్ సభ్యులంతా తప్పక హాజరు కావాలన్నారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖకు నూతన మేనేజ్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.
News October 30, 2025
పార్వతీపురం: రచ్చబండే క్లాస్ రూమ్ అయ్యింది..!

కురుపాం మండలంలో గోలవలస ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల శిథిలావ్యవస్థకు చేరుకుంది. వర్షాలు పడినప్పుడు పూర్తిగా కారిపోతున్న నేపథ్యంలో తప్పని పరిస్థితిల్లో గ్రామ రచ్చబండ దగ్గర విద్యార్థులకు టీచర్లు చదువులు చెప్పుతున్నారు. సర్పంచ్ సురేశ్ మాట్లాడుతూ.. సుమారు 50 సంవత్సరాలు క్రితం నిర్మించిన భవనం కావడంతో శిథిల వ్యవస్థకు చేరుకుందన్నారు. ఉన్నతాధికారులు స్పందించి నూతన భవనాన్ని మంజూరు చేయాలని కోరారు.


