News January 10, 2026
నల్గొండ ఖాకీల ‘కోడి’ విందు

పందెం రాయుళ్లపై ఉక్కుపాదం మోపాల్సిన ఖాకీలు.. వారు పట్టుకున్న కోళ్లనే కుమ్మేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. నల్గొండ టూ టౌన్ పరిధిలో టాస్క్‌ఫోర్స్ వాళ్లు స్వాధీనం చేసుకున్న పందెంకోళ్లు మాయమవ్వడం సంచలనంగా మారింది. సాక్ష్యాధారాల కింద కోర్టుకు పంపాల్సిన కోళ్లను, కొందరు పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా విందు చేసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ‘కోడి మాయాజాలం’పై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.
Similar News
News January 11, 2026
SSS: డెడ్ బాడీని పీక్కుతిన్న జంతువులు..?

పుట్టపర్తి – నారాయణపురం రైల్వే స్టేషన్ల మధ్య కొత్తచెరువు (M) లోచర్ల సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద ఓ పురుషుడి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. మృతుడికి సుమారు 50-60 ఏళ్ల వయసుంటుందన్నారు. అతని ఎత్తు 5.6 అడుగులు ఉన్నాడన్నారు. అతణ్ని అడవి జంతువులు పీక్కు తిన్నట్లు ఆనవాళ్లు ఉన్నాయన్నారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం పెనుకొండ ఆసుపత్రికి తరలించినట్లు హెడ్ కానిస్టేబుల్ ఎర్రిస్వామి తెలిపారు.
News January 11, 2026
లింగాల: గురుకుల ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ

లింగాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పేద విద్యార్థుల కోసం టీ.జి.వి.సెట్ (TG CET 2026) ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు నిర్వాహకులు రాజకుమార్ తెలిపారు. 4, 5, 6, 7వ తరగతుల్లో ప్రవేశం కోరుకునే విద్యార్థులకు డాక్టర్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. గతంలో ఈయన శిక్షణ ద్వారా 108 మంది విద్యార్థులు వివిధ గురుకులాలకు ఎంపికయ్యారని ఆయన పేర్కొన్నారు.
News January 11, 2026
T20 WC: బంగ్లా మ్యాచుల నిర్వహణకు పాక్ రెడీ!

భద్రతా కారణాల దృష్ట్యా ఇండియాలో T20 WC మ్యాచులు ఆడేందుకు బంగ్లాదేశ్ <<18761652>>నిరాకరించిన<<>> విషయం తెలిసిందే. ప్రత్యామ్నాయ వేదికల్లో నిర్వహించాలని ఐసీసీని కోరింది. ఈ క్రమంలో శ్రీలంకలో బంగ్లా మ్యాచులు సాధ్యం కాకపోతే తమ దేశంలో జరిపేందుకు సిద్ధమని పాకిస్థాన్ చెప్పినట్లు తెలుస్తోంది. అన్ని గ్రౌండ్లు రెడీగా ఉన్నాయని అధికారికంగా తెలియజేసినట్లు సమాచారం. కాగా బంగ్లా రిక్వెస్ట్‌పై ఇంకా ఐసీసీ నిర్ణయం తీసుకోలేదు.


