News October 25, 2025
నల్గొండ: గట్టెక్కిస్తుందనుకుంటే నిండా ముంచింది..!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు మండలాల్లో శుక్రవారం ఉదయం నుంచి కురిసిన వర్షాలు రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. ఐకేపీ కేంద్రాలు, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసింది. చేతికొచ్చిన వరిపైరు నేలకొరిగింది. పంట ప్రారంభంలో యూరియా కోసం ఇబ్బంది పడ్డామని, ఇప్పుడేమో వర్షాలతో నష్టపోయామని రైతులు వాపోయారు. ప్రభుత్వం స్పందించి నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించాలని, తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
Similar News
News October 25, 2025
KCRపై అభిమానం: సైకిల్‌పై భద్రాచలం టూ జూబ్లీహిల్స్!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా BRS కార్యకర్త భద్రాచలం నుంచి సైకిల్‌పై వినూత్న ప్రచారం చేపట్టారు. ఈ నెల 19న ప్రారంభించిన యాత్రలో, మాజీ సీఎం కేసీఆర్‌పై అభిమానం చాటుకున్నారు. కాంగ్రెస్ ‘గ్యారంటీల బాకీ కార్డుల’ చిత్రాలను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. BRS అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు.
News October 25, 2025
RR: మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు మహర్దశ..!

RR, MDCL జిల్లాల పరిధిలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు మహర్దశ పట్టనుందని అడ్మినిస్ట్రేషన్ విభాగం తెలిపింది. రాష్ట్రంలో మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు వడ్డీ లేని రుణాల పథకం కింద రూ.41.20 కోట్లను విడుదల చేసిందని కార్యదర్శి డాక్టర్ శ్రీదేవి తెలిపారు. RR, MDCL జిల్లాలకు 30% వరకు నిధులు సమకూరుతాయని తెలిపారు.
News October 25, 2025
కొండపి: స్కూల్ బస్సుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం

కొండపిలో ఓ ప్రైవేటు స్కూల్ బస్సుకు శనివారం పెను ప్రమాదం తప్పింది. కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కొండపి నుంచి అనకర్లపూడి వెళ్లే బస్సు పక్కకు ఒరిగింది. ఆ సమయంలో బస్సులో 40 మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. డ్రైవర్ చాకచక్యంతో విద్యార్థులను సురక్షితంగా బస్సు నుంచి కిందకు దించటంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు.


