News December 14, 2025
నల్గొండ: ‘గెలుపే లక్ష్యం.. ప్రలోభాల పర్వం’

జిల్లాలో మొదటి విడత పోలింగ్ ఫలితాలను అనుభవంగా తీసుకుంటూ, రెండో విడతలో ఎలాగైనా గెలుపే లక్ష్యంగా మిర్యాలగూడ నియోజకవర్గ సర్పంచ్, వార్డుమెంబర్ అభ్యర్థులు ముందుకెళ్తున్నారు. 10 మండలాల్లోని అభ్యర్థులు వ్యూహాలు రచిస్తూ, పోలింగ్‌కు ముందురోజు రాత్రి నుంచి ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారని ప్రజలు అంటున్నారు. ప్రజాస్వామ్య పండగగా ఉండాల్సిన ఎన్నికలు డబ్బు, గిఫ్టుల పోటీగా మార్చేశారని ఆరోపిస్తున్నారు.
Similar News
News December 14, 2025
నల్గొండ: బీసీల ఖాతాల్లోకి 49 శాతం సర్పంచ్ స్థానాలు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు ఆధిపత్యం చూపారు. మొత్తం 630 సర్పంచ్ స్థానాల్లో 308 చోట్ల బీసీలు గెలుపొందారు. వీటిలో 140 బీసీ రిజర్వ్ స్థానాలు కాగా, జనరల్ కేటగిరీలోనూ 158 స్థానాల్లో బీసీలు విజయం సాధించారు. ఎస్సీలు 138, ఎస్టీలు 91, ఓసీలు 93 స్థానాల్లో గెలిచారు. బీసీలకు 49 శాతం సర్పంచ్ స్థానాలు దక్కాయి.
News December 14, 2025
నల్గొండలో ప్రశాంతంగా పోలింగ్: ఎస్పీ

నల్గొండ జిల్లాలో రెండో విడత పంచాయతీ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుందని ఎస్పీ శరత్ చంద్ర పవార్
తెలిపారు. ఆయన జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును పర్యవేక్షించారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లా అంతటా 144 సెక్షన్ (163 బీఎన్ఎస్ఎస్) అమలులో ఉన్నట్లు స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడకూడదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News December 13, 2025
చిన్నకాపర్తిలో బోగస్ ఓటింగ్, రిగ్గింగ్ జరగలేదు: కలెక్టర్

చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో డ్రైనేజీలో ఓట్లు దొరికిన ఘటనపై ఎలాంటి బోగస్ ఓటింగ్ లేదా రిగ్గింగ్ జరగలేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. బ్యాలెట్ పేపర్లు బయటపడగానే ఆర్డీఓ అశోక్ రెడ్డిని పంపి విచారణ జరిపించామన్నారు. పోలైన ఓట్లు, కౌంటింగ్‌లో లెక్కించిన ఓట్లు, డ్రైనేజీలో దొరికిన ఓట్లు ఖచ్చితంగా సరిపోయాయని కలెక్టర్ తెలిపారు.


