News December 2, 2025

నల్గొండ: గ్రామాల్లో బుజ్జగింపుల పర్వం!

image

తొలిదశ నామినేషన్లకు గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలకు ఒకటే టెన్షన్ పట్టుకుంది.
జిల్లాలో అనేక పంచాయతీలో ప్రతీ పార్టీ నుంచి నలుగురైదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. గ్రామస్థాయి కార్యకర్తలు ఏళ్లుగా స్థానిక సంస్థల్లో పోటీ కోసం ఎదురుచూస్తున్నారు. తీరా ఆ అవకాశం రాగానే ఎగిరి గంతేసి బరిలోకి దూకారు. స్వతంత్ర అభ్యర్థులతో ఎలాంటి ఇబ్బందులు లేవు గానీ, తీరా పార్టీ అభ్యర్థులతోనే చిక్కులన్నీ.

Similar News

News December 2, 2025

HYDలో యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్

image

హైదరాబాద్‌లో మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం జరగనుంది. యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం హైదరాబాదులో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 23 యూరోపియన్ దేశాలకు చెందిన 23 ఉత్తమ చిత్రాలు ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితం కానున్నాయి. ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్, శ్రీసారథి స్టూడియోస్, అలయన్స్ ఫ్రాన్సిస్ హైదరాబాద్‌లో ఈ సినిమాలు ప్రదర్శించనున్నారు. ఈనెల 5వ తేదీ నుంచి 14 వరకు ఉచితంగా ప్రదర్శించనున్నట్లు తెలిపారు.

News December 2, 2025

WGL: నేనూ.. గ్రామానికి ప్రథమ పౌరుడిని..!

image

ఉమ్మడి జిల్లాలో GP ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. సర్పంచ్ పదవికి భారీ పోటీ ఉన్నా, గౌరవ వేతనం మాత్రం నెలకు రూ.6,500. 2015లో వేతనం రూ.5,000గా నిర్ణయించగా 2021లో రూ.6,500గా పెంచారు. అభివృద్ధి బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో ఆదాయం లేక అప్పులు మాత్రం భారం అవుతున్నాయి. అయినా ‘గ్రామానికి ప్రథమ పౌరుడు’ అన్న గౌరవం, ప్రతిష్ఠ కోసం రూ.లక్షలు ఖర్చు చేసి పోటీ పడుతున్నారు. మీ గ్రామాల్లో ఎలా ఉందో కామెంట్ చేయండి.

News December 2, 2025

లేటెస్ట్ అప్డేట్స్

image

* సచివాలయంలో విద్యుత్, మైనింగ్ శాఖలపై సమీక్ష నిర్వహించనున్న సీఎం చంద్రబాబు
* కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ వర్సిటీని ప్రారంభించనున్న సీఎం రేవంత్
* హైదరాబాద్‌లో మరోసారి ఐటీ అధికారులు సోదాలు.. వుడ్ బ్రిడ్జ్ హోటల్ యజమానిని విచారించిన అధికారులు.. షాగౌస్, పిస్తా హౌస్, మెహిఫిల్ హోటళ్లతో సంబంధాలపై ఆరా
* కువైట్-హైదరాబాద్ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. ముంబై విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్