News January 11, 2026

నల్గొండ: గ్రామీణ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

image

పట్టణంలోని రాంనగర్‌లో SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో నిరుద్యోగులకు ఎలక్ట్రిక్ హౌస్ వైరింగ్ కోర్సులో 30 రోజుల ఉచిత శిక్షణ అందజేస్తున్నామని సంస్థ సంచాలకులు సియాజీ రాయ్ తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం కల్పిస్తామన్నారు. ఉమ్మడి నల్గొండకు చెందిన 19 నుంచి 45 ఏళ్లలోపు పురుషులు అర్హులని, ఆసక్తి గల వారు జనవరి 18 లోపు సంస్థలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 9701009265 సంప్రదించాలన్నారు.

Similar News

News February 9, 2026

NLG: మున్సిపల్ పోలింగ్.. రెండు రోజులు సెలవులు: కలెక్టర్

image

మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల పరిధిలోని అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 10, 11 తేదీల్లో రెండు రోజుల పాటు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్‌ తెలిపారు. ఈ ఉత్తర్వులు నల్గొండ కార్పొరేషన్‌, మిర్యాలగూడ, హాలియా, నందికొండ, చండూరు, దేవరకొండ, చిట్యాల మున్సిపాలిటీలకు వర్తిస్తాయని పేర్కొన్నారు.

News February 9, 2026

నల్గొండ: ఎన్నికల పోలింగ్ సిబ్బంది కేటాయింపు

image

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది తుది ర్యాండమైజేషన్ పూర్తయింది. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా సాధారణ పరిశీలకులు రమేష్ సమక్షంలో కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఈ ప్రక్రియను నిర్వహించారు. ఈ నెల 11న ఎన్నికలు జరగనున్న నల్గొండ కార్పొరేషన్ సహా మిర్యాలగూడ, చండూరు వంటి మున్సిపాలిటీల్లోని 475 పోలింగ్ కేంద్రాలకు మొత్తం 2,855 మంది సిబ్బందిని (20% రిజర్వ్‌తో కలిపి) కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు.

News February 9, 2026

ఎన్నికలకు సిద్ధం.. సిబ్బంది ఖరారు: కలెక్టర్

image

జిల్లాలో ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ సిబ్బంది కేటాయింపు ప్రక్రియలో కీలకమైన చివరి విడత ర్యాండమైజేషన్ సోమవారం కలెక్టరేట్‌లో పూర్తయింది. ఎన్నికల సాధారణ పరిశీలకులు రమేష్ సమక్షంలో కలెక్టర్ చంద్రశేఖర్ ఈ ప్రక్రియను నిర్వహించారు. ​NLG కార్పొరేషన్ సహా MLG, నందికొండ, హలియా, DVK, చండూరు, చిట్యాల పురపాలక సంఘాల్లో 475 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.