News March 21, 2025
నల్గొండ: గ్రూప్స్ ఫలితాల్లో సత్తా చాటిన యువతి

త్రిపురారం మండలం మాటూరుకి చెందిన పోలగాని నరసింహ గౌడ్, వెంకాయమ్మ దంపతుల కుమార్తె శ్వేత గ్రూప్స్ ఫలితాల్లో సత్తా చాటింది. గ్రూప్-1లో 467మార్కులు, గ్రూప్-2లో 412 స్టేట్ ర్యాంక్, గ్రూప్-3లో 272 ర్యాంక్ సాధించింది. 3 నెలల క్రితం గ్రూప్-4 ఉద్యోగం సాధించి అడవిదేవులపల్లి MRO ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తోంది. గ్రూప్స్‌లో సత్తా చాటడంతో పలువురు శ్వేతను అభినందిస్తున్నారు.
Similar News
News March 28, 2025
పలు అంశాలపై సమీక్ష నిర్వహించిన మంత్రి కేవీఆర్

నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి శుక్రవారం సమీక్షించారు. వేసవి దృష్ట్యా విద్యుత్ సేవలు, సాగు నీరు, త్రాగు నీరు వంటి అంశాలపై మంత్రి అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
News March 28, 2025
నల్గొండ: సమస్యలపై అడిషనల్ కలెక్టర్‌కు వినతి

ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి హాజరై మాట్లాడుతూ.. 6 గ్యారంటీలను ప్రభుత్వం వెంటనే అమలుపరచాలని డిమాండ్ చేశారు. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌కు వినతి అందించారు. జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, సుధాకర్ రెడ్డి, నాగార్జున, దండెంపల్లి సత్తయ్య పాల్గొన్నారు.
News March 28, 2025
NLG: వడ్డీ కాసురులపై నజరేది?

NLG జిల్లాలో ఫైనాన్స్ వ్యాపారం ఇష్టారాజ్యంగా నడుస్తోంది. నిబంధనల ప్రకారం రూ.వందకు రూ.2 కు మించి వడ్డీ తీసుకోకూడదు. ప్రభుత్వ నుంచి అనుమతి తీసుకొని లెక్కలు పక్కాగా నిర్వహించాలి. అన్ని నిబంధనలు పాటిస్తూ ఫైనాన్స్ వ్యాపారం నడపాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో NLG, DVK, MLG, కట్టంగూర్, నకిరేకల్ ప్రాంతాల్లో చాలామంది ధనార్జనే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చిరు వ్యాపారులు ఆరోపిస్తున్నారు.