News March 21, 2025

నల్గొండ: గ్రూప్స్ ఫలితాల్లో సత్తా చాటిన యువతి

image

నల్గొండ జిల్లా త్రిపురారం మండలం మాటూరుకి చెందిన పోలగాని నరసింహ గౌడ్, వెంకాయమ్మ దంపతుల కుమార్తె శ్వేత గ్రూప్స్ ఫలితాల్లో సత్తా చాటింది. గ్రూప్-1లో 467మార్కులు, గ్రూప్-2లో 412 స్టేట్ ర్యాంక్, గ్రూప్-3లో 272 ర్యాంక్ సాధించింది. 3 నెలల క్రితం గ్రూప్-4 ఉద్యోగం సాధించి అడవిదేవులపల్లి MRO ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తోంది. గ్రూప్స్‌లో సత్తా చాటడంతో పలువురు శ్వేతను అభినందిస్తున్నారు.

Similar News

News March 28, 2025

వచ్చే నెల 19నుంచి రాహుల్ గాంధీ అమెరికా పర్యటన

image

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వచ్చే నెల 19న అమెరికాకు వెళ్లనున్నారు. బ్రౌన్ యూనివర్సిటీని సందర్శించిన అంతరం బోస్టన్‌లోని భారత సంతతి ప్రజలతో ఆయన మమేకమవుతారని తెలుస్తోంది. గత ఏడాది సెప్టెంబరులో ఆయన డల్లాస్‌, వాషింగ్టన్ డీసీలో పర్యటించారు. టెక్సాస్ వర్సిటీలో విద్యార్థులు, అధ్యాపకులతో ముచ్చటించారు.

News March 28, 2025

నిజామాబాద్ జిల్లాలో గంజాయి కలకలం

image

నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలం గుత్ప గ్రామంలో గంజాయి కలకలం రేపింది. అపురూపాలయం సమీపంలో ఉన్న రైల్వే బ్రిడ్జి కింద శుక్రవారం ముగ్గురు యువకులు గంజాయి సేవిస్తుండగా స్థానిక విలేకర్లు గ్రామస్థుల సహాయంతో పట్టుకున్నారు. గ్రామంలో విచారించగా వీరు ఇతరులకు విక్రయిస్తున్నారని తెలిసింది. మాక్లూర్ పోలీస్‌‌‌లకు సమాచారం అందించగా నిందితుల నుంచి మూడు ప్యాకెట్ల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు.

News March 28, 2025

నెల్లూరు: ఐదుగురు ఎంపీటీసీలు సస్పెండ్ 

image

విడవలూరు మండలానికి సంబంధించిన ఐదుగురు ఎంపీటీసీ సభ్యులను వైసీపీ అధిష్ఠానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినందుకు ఆవుల శ్రీనివాసులు(రామచంద్రాపురం), అక్కయ్యగారి బుజ్జమ్మ(పెద్దపాళెం), వెందోటి భక్తవత్సలయ్య(వరిణి), ముంగర భానుప్రకాశ్(దంపూరు), చింతాటి జగన్మోహన్(అలగానిపాడు)ను సస్పెండ్ చేసినట్లు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రకటించారు.

error: Content is protected !!