News March 12, 2025

నల్గొండ: గ్రూప్-2లో మనోళ్ల హవా

image

గ్రూప్-2లో ఉమ్మడి నల్గొండ వాసులు సత్తా చాటారు. కోదాడకు చెందిన వెంకట హరవర్ధన్ రెడ్డి 447.080 మార్కులు పొంది రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడు. మోత్కూరుకు చెందిన సాయికృష్ణారెడ్డి 422.91, రామన్నపేట మండలం సిరిపురానికి చెందిన సురేశ్ 411.865, పెన్ పహాడ్ మహ్మదాపురానికి చెందిన అన్నదమ్ములు శ్రీరామ్ మధుకు రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు, అతని తమ్ముడు శ్రీరామ్ నవీన్‌కు 326 ర్యాంకు వచ్చింది.

Similar News

News November 5, 2025

చలికాలంలో జుట్టూడకుండా ఉండాలంటే..

image

మిగతా సీజన్​లతో పోలిస్తే చలికాలంలో జుట్టు సమస్యలు ఎక్కువ. కాబట్టి జుట్టు సంరక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. తలస్నానానికి గోరువెచ్చటి నీటినే వాడాలి. తర్వాత కండీషనర్ మర్చిపోకూడదు. జుట్టు త్వరగా ఆరడానికి బ్లో డ్రైయ్యర్స్ వాడటం తగ్గించాలని సూచిస్తున్నారు. ఈ సీజన్​లో వెంట్రుకలకు ఎంత తరచుగా ఆయిల్ పెడితే అంత మంచిది. తేమ శాతం నిలిచి జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుందంటున్నారు.

News November 5, 2025

యూట్యూబర్‌పై క్రిమినల్ కేసు నమోదు

image

AP 175 న్యూస్ యూట్యూబర్ M.శ్రీనివాసరావుపై కందుకూరులో క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు CI అన్వర్ బాషా తెలిపారు. AP175 న్యూస్, గుండుసూది పేర్లతో శ్రీనివాసరావు సంచలనాత్మక కథనాలను యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తుంటారు. కందుకూరు MLA ఇంటూరిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఆయన ఇటీవల వీడియోలు పోస్ట్ చేశారు. కొందరితో కుట్ర చేసి MLA పరువుకు భంగం కలిగేలా శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా పోస్ట్ చేస్తున్నారని కేసు నమోదైంది.

News November 5, 2025

నేడు స్కూళ్లు, ఆఫీసులకు సెలవు

image

ఇవాళ గురుపూర్ణిమతో పాటు గురునానక్ జయంతి సందర్భంగా తెలంగాణలో విద్యాసంస్థలు, బ్యాంకులు, ఆఫీసులు మూసి ఉండనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అధికారిక సెలవు ప్రకటించింది. అటు ఏపీలో ఆప్షనల్ హాలిడే మాత్రమే ఉంది కాబట్టి స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు తెరిచి ఉండనున్నాయి. ఉద్యోగులు ఎవరైనా కావాలనుకుంటే సెలవు తీసుకోవచ్చు.