News March 12, 2025
నల్గొండ: గ్రూప్-2లో మనోళ్ల హవా

గ్రూప్-2లో ఉమ్మడి నల్గొండ వాసులు సత్తా చాటారు. కోదాడకు చెందిన వెంకట హరవర్ధన్ రెడ్డి 447.080 మార్కులు పొంది రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడు. మోత్కూరుకు చెందిన సాయికృష్ణారెడ్డి 422.91, రామన్నపేట మండలం సిరిపురానికి చెందిన సురేశ్ 411.865, పెన్ పహాడ్ మహ్మదాపురానికి చెందిన అన్నదమ్ములు శ్రీరామ్ మధుకు రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు, అతని తమ్ముడు శ్రీరామ్ నవీన్‌కు 326 ర్యాంకు వచ్చింది.
Similar News
News July 11, 2025
NLG: ఈ ఎన్నికల్లోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు

బీసీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయనున్నారు. సీఎం రేవంత్ అధ్యక్షతన ఇవాళ జరిగిన క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్ చట్ట సవరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1740 గ్రామపంచాయతీలు ఉన్నాయి. దీంతో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం సీట్లు దక్కనున్నాయి.
News July 10, 2025
జూలై 18న మూసీ కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల

మూసీ ప్రాజెక్ట్ నుంచి వానాకాలం సాగు సీజన్‌కు సంబంధించిన నీటి విడుదలను జూలై 18న ప్రారంభించనున్నట్లు ప్రాజెక్టు డీఈ చంద్రశేఖర్ తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం 641.63 అడుగుల నీరు నిల్వ ఉందన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సుమారు 40 వేల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు, సూర్యాపేటకు తాగునీరు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు.
News July 10, 2025
NLG: ముందస్తుకు మురిసి.. ఇప్పుడేమో దిగులు!

ఉమ్మడి జిల్లా రైతులకు ఈ వానాకాలం అనుకూలించడం లేదు. గతేడాది ఇదే సమయంలో కురిసిన భారీ వర్షాలకు జలాశయాలు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కానీ, ఈ సీజన్లో రైతులకు ఆ పరిస్థితి లేదు. ముందస్తు వర్షాలకు మురిసిన రైతులు ఇప్పుడు దిగులు పడుతున్నారు. మే నెలలో కురిసిన వర్ణాలకు కొందరు దుక్కులు దున్నుకుని పత్తి విత్తనాలను వేస్తే.. మరికొందరు పొలాలు నారు పోసుకున్నారు.