News December 1, 2025

నల్గొండ: గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణలో జిల్లా మంత్రులు

image

రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో ఉమ్మడి జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రైజింగ్- 2047 పాలసీ డాక్యుమెంట్‌ను పరిచయం చేస్తూ.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను సీఎంతో కలిసి వారు ఆవిష్కరించారు.

Similar News

News March 29, 2026

NLG: బ్లాక్ మార్కెట్‌లో సిలిండర్ రూ.2500 !

image

జిల్లాలో గ్యాస్ కొరత అక్రమార్కులకు వరంగా మారింది. గతంలో 24 గంటల్లో వచ్చే సిలిండర్, ఇప్పుడు 15 రోజులు గడిచినా అందని పరిస్థితి నెలకొంది. దీన్ని ఆసరాగా చేసుకుని దళారులు బ్లాక్ మార్కెట్‌లో డొమెస్టిక్ సిలిండర్‌ను రూ. 2500కు, కమర్షియల్ సిలిండర్‌ను ఏకంగా రూ.8000కు విక్రయిస్తూ సామాన్యులను నిలువునా దోచుకుంటున్నారు. గృహ అవసరాలకు రావాల్సిన కోటాను అక్రమంగా హోటళ్లకు మళ్లిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

News March 29, 2026

అత్తామామల బాధ్యత కోడలిపై ఉండదు: అలహాబాద్ హైకోర్టు

image

BNSS సెక్షన్ 144 లేదా CrPC సెక్షన్ 125 ప్రకారం కోడలు తన అత్తామామలను పోషించడానికి బాధ్యత వహించరని అలహాబాద్ హైకోర్టు వెల్లడించింది. ‘సెక్షన్ 144 ప్రకారం మెయింటెనెన్స్ కోరే హక్కు కొందరికి ఉంది. అత్తామామలు ఆ పరిధిలోకి రారు. వారిని సంరక్షించాలనే నైతికత ఉన్నప్పటికీ చట్టపరమైన బాధ్యతగా అమలు చేయలేం’ అని పేర్కొంది. కొడుకు చనిపోయినందున కోడలు తమ బాగోగులు చూడాలంటూ వృద్ధులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది.

News March 29, 2026

మానవపాడు: 2760 మహిళలు ఓపెన్ 10వ తరగతి పరీక్షలు

image

మానవపాడు మండలంలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఓపెన్ 10వ తరగతి పరీక్షలు నిర్వహించారు. సుమారు 2760 మంది మహిళలు ఆదివారం పరీక్షలు రాశారు. పరీక్షా కేంద్రాలను MEO శివప్రసాద్ పరిశీలించారు. మహిళలు రాయడం, చదువుతోపాటు కనీసం 10 పరీక్షలు రాయడం ద్వారా వారి విద్యా అభివృద్ధిని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ పరీక్షలను నిర్వహిస్తోందని ఆయన తెలిపారు.