News January 13, 2026
నల్గొండ: ‘చిట్టిమల్లు’ రేపిన పల్నాటి యుద్ధం..!

పల్నాటి యుద్ధం.. తెలుగు వాళ్లకు పేరిన్నిక గల యుద్ధం. ఈయుద్ధానికి కారణం ఓ కోడి పుంజు అని తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆ పుంజే చిట్టిమల్లు. ఒకప్పుడు పల్నాడులో రాజ్యాల మధ్య ఆధిపత్య, ఆక్రమణల కుట్రలు సాగాయి. నాయకురాలు నాగమ్మ కోడిపై గెలవడం కోసం బ్రహ్మనాయుడు మహిమ గల కోడి కోసం ఆరా తీస్తాడు. ఆనాడు శక్తిమంతమైన చిట్టిమల్లుగా పిలిచే పుంజును కుందూరు చోడుల రాజధానిగా ఉన్న మన NLG పానగల్లు నుంచే తీసుకెళ్లారు.
Similar News
News January 25, 2026
టెండర్ల రద్దుపై విచారణకు సిద్ధం: కోమటిరెడ్డి

TG: సింగరేణి టెండర్ల రద్దుపై విచారణకు సిద్ధమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. టెండర్లలో స్కామ్ జరిగితే ఉపేక్షించబోమన్నారు. ‘కిషన్ రెడ్డి లేఖ రాస్తే దగ్గరుండి విచారణ చేయిస్తా. నా సోదరుల కంపెనీలతో నాకు సంబంధం లేదు. నాకు ఏ కంపెనీలో వాటా లేదు. డబ్బులే కావాలనుకుంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఎందుకు చెబుతా?. మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి కోసమే BRS దుష్ప్రచారం చేస్తోంది’ అని ఫైరయ్యారు.
News January 25, 2026
రాజమండ్రి: రేపు PGRS కార్యక్రమం రద్దు

రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానంలో గణతంత్ర వేడుకల నేపథ్యంలో సోమవారం నిర్వహించాల్సిన PGRSను రద్దు చేసినట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ వై.మేఘా స్వరూప్ ఆదివారం తెలిపారు. రిపబ్లిక్ డే కారణంగా రెవెన్యూ క్లినిక్ అర్జీల స్వీకరణ ఉండదని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఈ మార్పును గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వేడుకల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.
News January 25, 2026
అల్లూరి: వెలుగు ఏపీఎం ఆకస్మిక మృతి

అల్లూరిజిల్లా గూడెం కొత్తవీధి వెలుగు ఏపీఎం సూర్యారావు పాడేరు జిల్లా కేంద్రంలో ఆదివారం మరణించారు. శనివారం పాడేరుజిల్లా కార్యాలయానికి వెళ్లి రాత్రి కావడంతో ఓ లాడ్జిలో బస చేశారు. ఆదివారం ఉదయం లాడ్జి సిబ్బంది చూసి కదలిక లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సూర్యరావు మృతదేహన్ని పాడేరు ఆసుపత్రికి తరలించారు. విజయనగరం జిల్లా రాజాంకు చెందిన సూర్యారావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.


