News June 13, 2024
నల్గొండ: చిన్నారి దారుణ హత్య

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. NZB జిల్లా రెంజల్ మండలానికి చెందిన నవ్యశ్రీకి అదే మండలానికి చెందిన లక్ష్మణ్‌తో ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వారికి అరుణ్య, మహన్వి(22నెలలు) కుమార్తెలున్నారు. 7 నెలల క్రితం అరవిందరెడ్డి అనే వ్యక్తితో నవ్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తను వదిలేసి చిన్నారులతో నల్గొండ జిల్లాకు వచ్చి ఉంటోంది. తన వివాహేతర సంబంధానికి మహన్వి అడ్డువస్తోందని అరవిందరెడ్డి హతమార్చాడు.
Similar News
News March 2, 2026
హోలీ రోజు డ్రంకెన్ డ్రైవ్ తనీఖీలు: ఎస్పీ శరత్ చంద్ర పవార్

హోలీ పండుగ రోజు జిల్లావ్యాప్తంగా విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. మహిళల రక్షణ కోసం ‘షీ టీమ్స్’ నిరంతరం పహారా కాస్తాయని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ప్రజలందరూ ఇతరులకు హాని కలగకుండా ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని ఎస్పీ సూచించారు.
News March 2, 2026
నల్గొండ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

నల్గొండ మండలం చందనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామంలోని మిషన్ భగీరథ ట్రీట్మెంట్ ప్లాంటు సమీపంలో నకిరేకల్ నుంచి నల్గొండకు వస్తున్న బైక్, ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న ఇద్దరు చనిపోయారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News March 1, 2026
నల్గొండ: పంచాయతీ నిధులపై పాత, కొత్త ‘సర్పంచుల’ పోరు

గ్రామ పంచాయతీలకు విడుదలైన 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం ఇప్పుడు పాత, కొత్త సర్పంచుల మధ్య చిచ్చు పెడుతోంది. గతంలో పూర్తి చేసిన పనులకు సంబంధించి సుమారు రూ.50 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రస్తుత నిధుల నుంచి ఆ బకాయిలు చెల్లించాలని మాజీ సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. కొత్త సర్పంచులు తమ అభీష్టం మేరకే
నిధులు ఖర్చు చేస్తామంటున్నారు. పాత బిల్లులు చెల్లించాలని మాజీలు డిమాండ్ చేస్తున్నారు.


