News March 22, 2025
నల్గొండ జిల్లాకు మిస్ వరల్డ్ పోటీదారులు

ఉమ్మడి NLGలోని పర్యాటక ప్రాంతాలను మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించనున్నారు. మే12న నాగార్జునసాగర్‌కు, 15న పోచంపల్లి, యాదగిరిగుట్టకు సుందరీమణులు రానున్నారు. సాగర్‌లో బౌద్ధ సంస్కృతిని పరిచయం చేయడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ఆ ప్రాంతానికి గుర్తింపు వచ్చేలా పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. వీరి పర్యటన నేపథ్యంలో నేడు నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఉన్నతాధికారులు బుద్ధవనంలో సమావేశం నిర్వహించనున్నారు.
Similar News
News February 27, 2026
HNK: గంటల వ్యవధిలో తల్లీకొడుకు మృతి

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంథినిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉపేంద్ర(72) అనే వృద్ధురాలి కుమారుడు నరహరి (55) బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో ఆమె మనస్తాపం చెంది బుధవారం ఉదయం కన్నుమూశారు. తల్లి అంత్యక్రియలు ముగిసిన కొద్దిసేపటికే రాత్రి నరహరి కూడా మృతి చెందారు. గంటల వ్యవధిలో ఇద్దరినీ కోల్పోవడంతో కుటుంబసభ్యులు, గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు.
News February 27, 2026
రఘురామకృష్ణరాజుకు విజయవంతంగా శస్త్రచికిత్స

డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజుకు హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో గురువారం శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. విజయవాడలో జరిగిన శాసనసభ్యుల ఆటవిడుపు క్రీడల్లో భాగంగా క్రికెట్ ఆడుతుండగా, పరుగు కోసం ప్రయత్నించి ఆయన కింద పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన మణికట్టు ఎముక విరగడంతో వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
News February 27, 2026
సాగర్‌లో తగ్గుతున్న నీటి నిల్వలు!

TG: నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 537 అడుగుల మేరకు 182 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అయితే కనీస నీటిమట్టం 510 అడుగులకు పైన 51 టీఎంసీల లభ్యత మాత్రమే ఉందని అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. రానున్న రోజుల్లో తాగు, సాగు అవసరాలకు 65 టీఎంసీల అవసరం ఉందని తెలిపారు. అందువల్ల కనీస నీటిమట్టాన్ని కొనసాగించేందుకు కుడి, ఎడమ కాలువలకు జలాల విడుదలలో నియంత్రణ అవసరమని పేర్కొన్నారు.


