News March 10, 2025
నల్గొండ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఈనెల 11, 12 తేదీల్లో నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. కమిషన్ ఛైర్మన్ వెంకటయ్య అధ్యక్షతన సభ్యులు కుస్త్రం నీలాదేవి, రాంబాబునాయక్, కొంకతి లక్ష్మీ నారాయణ, జిల్లా శంకర్, రేణిగుంట్ల ప్రవీణ్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసులు, భూములకు సంబంధించిన కేసులపై సమీక్షిస్తారని పేర్కొన్నారు.
Similar News
News March 29, 2026
నల్లగొండ: వేదిక మారింది.. రాతలు మారేనా..?

నల్లగొండ జిల్లాలో దివ్యాంగులు, వృద్ధుల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం సరికొత్త శ్రీకారం చుట్టింది. ప్రతి నెల చివరి శనివారం వీరికి మాత్రమే కేటాయిస్తూ ప్రత్యేక ‘ప్రజావాణి’ని కలెక్టర్ చంద్రశేఖర్ ప్రారంభించారు. సాధారణ రోజుల్లో రద్దీ వల్ల వీరు పడుతున్న ఇబ్బందులను గమనించి ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలం అర్జీలు స్వీకరించడమే కాకుండా అక్కడికక్కడే పరిష్కారం చూపాలని బాధితులు కోరుతున్నారు.
News March 29, 2026
నల్గొండ: 7,624 కేసులు పరిష్కారం: ఎస్పీ

న్యాయ వివాదాల పరిష్కారానికి లోక్ అదాలత్ ఒక చక్కని వేదికని, దీని ద్వారా ప్రజలకు త్వరితగతిన న్యాయం అందుతుందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో పోలీస్, న్యాయ శాఖల సమన్వయంతో రికార్డు స్థాయిలో 7,624 కేసులు పరిష్కారమయ్యాయని తెలిపారు. పరిష్కారమైన కేసుల్లో 4,182 డీడీ కేసులు, 2,512 ఈ-పెట్టీ, 886 ఐపీసీ, 44 ఎస్ఎల్ఎల్ కేసులు ఉన్నాయని వివరించారు.
News March 29, 2026
సాగర్‌లో విమానాశ్రయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్!

నాగార్జునసాగర్‌లో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం ఏర్పాటుకు ఏపీ పంపిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టే ఈ భారీ ప్రాజెక్టుకు జూన్‌లో శంకుస్థాపన చేయనున్నారు. సాగర్ ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్, తిరుపతి, బెంగళూరుతో పాటు విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు ఎంతో వెసులుబాటు కలుగుతుంది. దీంతో ఉభయ రాష్ట్రాల పర్యాటక రంగంలో కొత్త వెలుగులు నిండనున్నాయి.


