News January 24, 2025
నల్గొండ జిల్లాలో గణతంత్ర వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

నల్గొండ జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. పట్టణంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఆదివారం ఉదయం 9 గంటలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. 9:30 గంటలకు బాల బాలికల సాంస్కృతిక విన్యాస కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం శకటాల ప్రదర్శన జరుగుతుందని అధికారులు తెలిపారు.
Similar News
News February 3, 2026
హాలియాలో హైటెన్షన్.. అభ్యర్థిని గృహనిర్బంధంపై ఘర్షణ

హాలియాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. 4వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రమీలను అధికార పార్టీ నాయకులు గృహనిర్బంధం చేశారన్న ఆరోపణలతో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే భగత్ అక్కడికి చేరుకోవడంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, భగత్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. భారీగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలతో ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
News February 3, 2026
నల్గొండ: చెట్టుపై నుంచి బావిలో పడి కాపరి మృతి

కేతేపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. తుంగతుర్తి గ్రామానికి చెందిన మేకల కాపరి జటంగి సైదులు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందారు. సోమవారం మేకల మేత కోసం చెట్టు కొమ్మలు కొడుతుండగా కాలు జారి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
News February 3, 2026
NLG: B.P.Ed &D.P.Ed విద్యార్థులకు గమనిక

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో B.P.Ed & D.P.Ed సెమిస్టర్-1 రెగ్యులర్ సంబంధిచి పరీక్షలో స్వల్ప మార్పు చేస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ ఉపేందర్‌రెడ్డి తెలిపారు. ఈనెల 11వ తారీఖున మున్సిపల్ ఎన్నికలు కారణంగా ఆరోజు జరగవలసిన పరీక్షను 13వ తేదీకి రీ-షెడ్యూల్ చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సంబంధిత కళాశాలలు, విద్యార్థులు గమనించాలని ఆయన కోరారు.


