News April 4, 2024

నల్గొండ జిల్లాలో భానుడి భగభగ

image

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి. ఈ క్రమంలో నల్గొండ జిల్లా అత్యధికంగా నిడమనూరులో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని, ఈ సమయాల్లో పిల్లలు, వృద్ధులు బయటకు రావొద్దని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News November 9, 2025

NLG: ఇటు పంట నష్టం… అటు ఆర్థిక భారం!

image

జిల్లాలో కూలీల కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. పత్తి సేకరణకు కూలీలు దొరకడం లేదు. వరి కోతలు, పత్తి ఏరడం ఏకకాలంలో మొదలయ్యాయి. దీంతో కూలీలకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. ఇటీవల మొంథా తుఫాన్ కారణంగా వరి చేలు నేలకొరిగాయి. చాలా ప్రాంతాల్లో నేలకొరిగిన వరి మొలకెత్తాయి. ఉన్న పంటను కోయడానికి కూలీలు, వరి కోత మిషన్లు దొరికినా వరి కోయడానికి అధిక సమయం పడుతుండటంతో ఆర్థిక భారంతో రైతులు సతమతమవుతున్నారు.

News November 9, 2025

NLG: కూరగాయలు కొనేటట్లు లేదు..!

image

నల్గొండ జిల్లాలో కూరగాయల ధరలు పైపైకి పోతున్నాయి. నెల రోజుల నుంచి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. నెల క్రితం ఏ కూరగాయలను తీసుకున్నా కేజీ రూ.20 నుంచి రూ.30 వరకే ఉండేవి. అలాంటిది ఒకేసారి కార్తీకమాసంలో రూ.60 నుంచి రూ.160 వరకు ఎగబాకాయి. ప్రతీరోజూ కూరల్లో వాడే టమోటాలు కేజీ రూ.40కు ఎగబాకింది. ఎన్నడూ లేనట్టుగా కేజీ బీన్స్ రూ.160 వరకు ఉంది. మునగ కాయలు భారీ ధర పలుకుతున్నాయి.

News November 8, 2025

నల్గొండ జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

→మిర్యాలగూడ : మత్తు మాత్రలు అమ్ముతున్న ముఠా అరెస్ట్
→మునుగోడు: అయ్యప్ప స్వాములకు ముస్లిం అన్నదానం
→HYD-VJD హైవే 8 లేన్ల విస్తరణ: కోమటిరెడ్డి
→నల్లగొండ: చెరువుకు చేరుతున్న చేప.. 6 కోట్ల చేప పిల్లల పంపిణీ
→నల్లగొండ: ఎల్లలు MGU దాటిన ఖ్యాతి
→నల్లగొండ: ఈ ఇసుక ఎక్కడి నుంచి వస్తుందో..
→నల్లగొండ: పలువురు జడ్జీలకు స్థాన చలనం
→చిట్యాల: రోడ్డు ప్రమాదం.. కారు పూర్తిగా దగ్ధం