News April 13, 2025

నల్గొండ జిల్లాలో భారీ ఉష్ణోగ్రతలు నమోదు

image

జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. గత రెండు మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా 40 డిగ్రీలకు పైనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం దామరచర్ల మండలంలో 41.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అతి తక్కువగా చింతపల్లి మండలం గోడకండ్లలో 37.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా బీబీనగర్ బొమ్మలరామారంలో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Similar News

News February 4, 2026

MLG: హాస్టళ్లలో నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్

image

ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ వార్డెన్లను ఆదేశించారు. బుధవారం మిర్యాలగూడలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గదులు, వంటశాల, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి, విద్యార్థులతో నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.

News February 4, 2026

MGU: గర్భాశయ క్యాన్సర్‌పై అప్రమత్తత అవసరం: డా. రాజేశ్వరి

image

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా MGU వర్సిటీ NSS ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథి డా. రాజేశ్వరి మాట్లాడుతూ.. మహిళలు HIV పట్ల అప్రమత్తంగా ఉండాలని, టీకా ద్వారా గర్భాశయ క్యాన్సర్‌ను నివారించవచ్చని సూచించారు. జీవనశైలి మార్పులు, వ్యాధిని తొలిదశలో గుర్తించడం ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని డాక్టర్ వసంతకుమారి పేర్కొన్నారు. వర్సిటీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

News February 4, 2026

మిర్యాలగూడకు బయలుదేరిన సీఎం రేవంత్

image

సీఎం రేవంత్ రెడ్డి మిర్యాలగూడ పర్యటనకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరారు. ఆయన వెంట మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌, ఎంపీ రఘువీర్‌రెడ్డి ఉన్నారు. గూడూరులో రూ.200 కోట్లతో నిర్మించతలపెట్టిన ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్’కు సీఎం శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించి, మహిళా స్వయం సహాయక సంఘాలకు చెక్కులు పంపిణీ చేయనున్నారు.