News July 29, 2024
నల్గొండ: జిల్లాలో స్థానిక ఎన్నికల జోష్

నల్గొండ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. CM రేవంత్ ప్రకటనతో ఆశావహుల్లో జోష్ పెరిగింది. సర్పంచుల పదవీకాలం పూర్తయి 6 నెలలు అవుతుండగా, MPTC, ZPTCల పదవీ కాలం ఈనెల 5న ముగిసిన విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికలు త్వరలో నిర్ణయిస్తామని, ఆగస్టు మొదటి వారంలోగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలంటూCMరేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తొలుత MPTC,ZPTCల ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News August 7, 2025
NLG: వివాహం కావడం లేదని యువతి ఆత్మహత్య

డిండిలోని డీఎన్టీ కాలనీకి చెందిన పెండ్ర రూప (26) వివాహం కావడం లేదని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని ఎస్సై బాలకృష్ణ తెలిపారు. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.
News August 7, 2025
NLG: వారు అడగలేరు.. ప్రభుత్వమే ఇస్తే బాగు..!

పై చిత్రంలో కనిపిస్తున్న జిల్లోజు పూలమ్మ, జిల్లోజు రాములు అక్కాతమ్ముళ్లు. పుట్టుకతోనే మూగవారు. వీరి స్వగ్రామం SLG(M) ఇటుకులపహాడ్. బాల్యంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. వృద్ధాప్యంతో ఇబ్బందిపడుతున్నా నేటికీ పింఛను రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, కలెక్టర్ స్పందించి వారికి పింఛను మంజూరు చేయాలని కోరుతున్నారు.
News August 7, 2025
మిర్యాలగూడలో సాండ్ బజార్ ప్రారంభం

ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు మిర్యాలగూడలో సాండ్ బజార్‌ను ఏర్పాటు చేశారు. చింతపల్లి ఎక్స్ రోడ్డు వద్ద కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్యే బీఎల్ఆర్ ప్రారంభించారు. అందుబాటు ధరలో నాణ్యమైన ఇసుకను అందించడమే లక్ష్యమని వారు పేర్కొన్నారు.