News January 28, 2025
నల్గొండ జిల్లాలో 3.20 లక్షల ఎకరాల్లో వరి సాగు

నల్గొండ జిల్లాలో యాసంగి వరి సాగు ఊపందుకుంది. నాన్ ఆయకట్టులో ఇప్పటికే వరి నాట్లు పూర్తి కావచ్చాయి. ఆయకట్టు పరిధిలో వరినాట్లు కొనసాగుతున్నాయి. రైతులంతా సీజన్‌లో వరి సాగు వైపే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 3.20 లక్షల ఎకరాలలో వరి పంట సాగైనట్లు అధికారుల అంచనా. ఫిబ్రవరి నాటికి జిల్లాలో వరి నాట్ల సాగు పూర్తి కానున్నట్లు వారు పేర్కొంటున్నారు.
Similar News
News April 5, 2026
నల్గొండలో ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి

NLG: స్వాతంత్ర సమరయోధుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్ రామ్ జయంతిని ఈరోజు నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఎన్జీ కళాశాల ఎదురుగా, మర్రిగూడ బైపాస్ వద్ద ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహాలకు కలెక్టర్ చంద్రశేఖర్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి పూలమాలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్, గుమ్ముల మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
News April 5, 2026
నల్గొండ: మందులేదు.. టీకానే శ్రీరామరక్ష!

పశువులకు సోకే గాలికుంటు అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి. వైరస్ వల్ల వచ్చే ఈ రోగానికి ప్రత్యేకమైన మందు లేదు. వ్యాధి సోకితే కేవలం లక్షణాలను బట్టి గాయాలు కడగడం, యాంటీ బయాటిక్స్ వాడటం, మెత్తటి మేత పెట్టడం మాత్రమే చేయగలం. దీంతో పశువులు తీవ్రంగా ఇబ్బంది పడతాయి. అందుకే ముందు జాగ్రత్తగా ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న గాలికుంటు నిరోధక టీకాలను రైతులు తమ పశువులకు తప్పనిసరిగా వేయించి కాపాడుకోవాలి.
News April 5, 2026
NLG: ఫ్రిడ్జ్ పేలకూడదంటే.. ఈ జాగ్రత్తలు మరువొద్దు

వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల రిఫ్రిజిరేటర్లు పేలుతున్న <<19570386>>ఘటన<<>>లు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటిని నివారించాలంటే ఫ్రిడ్జ్‌ను గోడకు ఆనించకుండా గాలి ఆడేలా కనీసం అడుగు దూరం ఉంచాలి. దీనివల్ల కంప్రెసర్ వేడి బయటకు పోతుంది. వోల్టేజ్ హెచ్చుతగ్గుల నుంచి రక్షణకు నాణ్యమైన స్టెబిలైజర్ వాడాలి. ఫ్రిడ్జ్‌లో పరిమితికి మించి వస్తువులను కుక్కకూడదు. ఇబ్బందులుంటే మెకానిక్‌తో తనిఖీ చేయిస్తే ప్రమాదాలను నివారించవచ్చు.


