News March 5, 2025

నల్గొండ జిల్లాలో 52 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు

image

నల్గొండ జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 52 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా వాటి పరిసరాల్లో BNS 163 (144) సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఉ.9 గంటల నుంచి మ.12 వరకు పరీక్షలు జరుగుతాయి. సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. ఈసారి 5 నిమిషాల గ్రేస్‌ పీరియడ్‌ను అమలులోకి తీసుకొచ్చారు. జిల్లాలో 28,722 మంది పరీక్ష రాయనున్నారు.

Similar News

News March 5, 2025

NLG: ‘సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి’

image

సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సైబర్ క్రైమ్ డిఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు. సైబర్ జాకృత్క దివాస్ సందర్భంగా నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాలు పని రకాలు ఉంటాయని, వాటిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు.

News March 5, 2025

నల్గొండ జిల్లాలో 619 మంది పరీక్ష‌కు గైరాజరు.!

image

నల్గొండ జిల్లాలో ఇంటర్ వార్షిక పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 12,675 మంది జనరల్ విద్యార్థులు, 2010 మంది ఒకేషనల్ విద్యార్థులు కలిపి 14,685 మంది హాజరు కావాల్సి ఉండగా.. జనరల్ విద్యార్థులు 12,272 మంది, ఒకేషనల్ విద్యార్థులు 1,794 మంది విద్యార్థులు కలిపి 14 వేల 66 మంది హాజరయ్యారు. 403 మంది జనరల్ విద్యార్థులు, 216 మంది ఒకేషనల్ విద్యార్థులు కలిపి 619 గైర్హాజరయ్యారు.

News March 5, 2025

NLG: తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యలపై జానారెడ్డి స్పందన.!

image

ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి స్పందించారు. కుల గణన అంశంలో తన పాత్రలేదని, గాలి మాటలు మాట్లాడటం సరికాదన్నారు. తప్పు చేసిన వాడ్ని క్షమించే గుణం తనదన్నారు. తీన్మార్ మల్లన్న ఏ ప్రెస్ మీట్స్ పెట్టుకుంటే.. తనకేంటని జానారెడ్డి పేర్కొన్నారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని, సలహాలు అడిగితే ఇస్తానన్నారు. కేసీఆర్ పాత్ర ఏంటి అనేది ప్రజలే నిర్ణయిస్తారన్నారు.

error: Content is protected !!