News February 27, 2025

నల్గొండ జిల్లాలో 94.66 శాతం పోలింగ్

image

వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నల్గొండ జిల్లా పోలింగ్ 94.66 శాతం నమోదయింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన వారంతా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ పూర్తయిన అనంతరం పోలింగ్ బాక్స్‌లను పోలీసు బందోబస్తు నడుమ జిల్లా కేంద్రంలోని ఆర్జాలబావి గిడ్డంగుల సంస్థ గోదాములకు తరలించారు.

Similar News

News February 27, 2025

నల్గొండ: 55.48 శాతం పోలింగ్ నమోదు

image

వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటింగ్‌లో భాగంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 12 గంటల వరకు 2,598 మంది ఉపాధ్యాయులు ఓట్లు వేయగా 55.48% పోలింగ్ నమోదైంది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయగా ఎన్నికల అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

News February 27, 2025

నల్గొండ: కల్లు గీస్తుండగా పాముకాటుతో మృతి

image

నార్కట్ పల్లి మండలం తొండల్ వాయికి చెందిన గీత కార్మికుడు దంతూరి శంకర్ బుధవారం సాయంత్రం పాముకాటుతో మరణించారు. గ్రామ సమీపంలోని తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా పాము కాటు వేసిందని, కిందికి దిగిన శంకర్ తోటి గీత కార్మికుడికి విషయం చెప్పి కిందపడిపోయాడని స్థానికులు తెలిపారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. శంకర్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News February 27, 2025

నల్గొండ: ఫోన్ పే, గూగూల్ పే ద్వారా బస్ టికెట్

image

TGSRTC బస్సుల్లో డిజిటల్ చెల్లింపులను అమలులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా ఐ-టిమ్స్ మెషీన్లను ప్రవేశపెట్టనుంది. తొలి విడతలో భాగంగా 310 మెషీన్లను కొనుగోలు చేసింది. దీంతో నల్గొండ రీజియన్‌లోని నార్కట్ పల్లి, నల్గొండ, దేవరకొండ, మిర్యాలగూడ డిపోల ప్రయాణికులకు చిల్లర బాధలు తప్పనున్నాయి.

error: Content is protected !!