News March 10, 2025
నల్గొండ: దాసోజు శ్రవణ్ కుమార్ రాజకీయ నేపథ్యం ఇదే..!

సెప్టెంబర్ 7, 1966లో NLG జిల్లాలో జన్మించిన దాసోజు శ్రవణ్ కుమార్.. 2008లో ప్రజారాజ్యం పార్టీతో క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో సికింద్రాబాద్ లోక్‌సభ నుంచి పీఆర్పీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో పీఆర్పీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు. జాయింట్ యాక్షన్ కమిటీలో స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా, ఉద్యమకారుడిగా తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు.
Similar News
News February 14, 2026
BREAKING.. పటాన్‌చెరు: ORRపై యాక్సిడెంట్

పటాన్‌చెరు మండలం పోచారం ఔటర్ రింగ్ రోడ్ శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఇంద్రేశానికి చెందిన ఎండి ముజీబుద్దీన్(28) అక్కడికక్కడే మృతి చెందగా.. స్నేహితులు అస్లాం, చంద్రశేఖర్, నిత్యానంద్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 14, 2026
కోస్టల్ కారిడార్‌లో మార్పులు

సవరించిన VMRDA మాస్టర్ ప్లాన్‌లో భోగాపురం ఎయిర్‌పోర్ట్ అనుసంధాన బీచ్ కారిడార్‌కు స్వల్ప మార్పులు ప్రతిపాదించారు. కోస్టల్ బ్యాటరీ-కైలాసగిరి వరకు 40M, అక్కడి నుంచి భోగాపురం వరకు 60M వెడల్పుతో రహదారి ప్రతిపాదన, రాడిసన్ బ్లూ వద్ద ఎలివేటెడ్ మార్గం, మూలకుద్దు సమీపంలో ఐకానిక్ బ్రిడ్జి ప్రణాళికలో ఉన్నాయి. ఈ మార్పులు ట్రాఫిక్ సౌలభ్యం, పర్యాటక అభివృద్ధి దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లు అధికారులు తెలిపారు.
News February 14, 2026
మక్తల్: టీచర్‌తో పోటీపడి గెలిచిన విద్యార్థి

నారాయణపేట జిల్లా మక్తల్ 14వ వార్డులో ఆసక్తికర పోరు జరిగింది. తనకు పాఠాలు నేర్పిన గురువుపైనే శిష్యురాలు మానస హనుమంతు (కాంగ్రెస్) విజయం సాధించారు. బీజేపీ తరఫున పోటీ చేసిన తన ఉపాధ్యాయురాలిపై 113 ఓట్ల మెజార్టీతో మానస గెలుపొందారు. ఈ అరుదైన విజయంపై స్థానికులు ‘గురువును మించిన శిష్యురాలు’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.


