News January 1, 2026
నల్గొండ: ‘నీ వాహనం వేగం.. నీ జీవితం ఆగం’

నేటి నుంచి రోడ్డు భద్రత వారోత్సవాలు జరగనున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని విజయవాడ-హైదరాబాద్ రహదారిపై అధిక వేగం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. చిట్యాల మండలం వెలిమినేడు వద్ద జిల్లా పోలీసులు ఏర్పాటు చేసిన హోర్డింగ్ వాహన చోదకులను ఆలోచింపజేస్తుంది. ‘నీ వాహనం వేగంగా వెళుతుంది.. కానీ, నీ జీవితం ఆగిపోతుంది’ అనే కొటేషన్‌తో ఫ్లెక్సీని ఏర్పాటు చేసి, దెబ్బతిన్న వాహనాన్ని ఇనుప స్టాండ్ పై నిలిపారు.
Similar News
News January 2, 2026
మరిన్ని ODI సిరీస్‌లు నిర్వహించాలి: ఇర్ఫాన్ పఠాన్

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కోసం 5 మ్యాచ్‌ల ODIలు, ట్రై/క్వాడ్రిలేటరల్ సిరీస్‌లు నిర్వహించాలని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డారు. 3 మ్యాచ్‌ల సిరీస్‌లే ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. వీరి ఆట చూడాలంటే వన్డేల్లో అలాంటి సిరీస్‌లు అవసరమని చెప్పారు. ప్రస్తుతం రోహిత్, కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నారని గుర్తుచేశారు. కాగా జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో భారత్ 3 వన్డేల సిరీస్ ఆడనుంది.
News January 2, 2026
టాప్ స్టోరీస్

* కృష్ణా జలాల అంశంలో KCR, హరీశ్ చేసిన అన్యాయానికి ఉరేసినా తప్పులేదు: CM రేవంత్
* నదీ జలాలపై CMకు కనీస అవగాహన లేదు: KTR
* CMకు బచావత్-బ్రిజేష్ ట్రిబ్యునళ్ల మధ్య తేడా తెలీదు: హరీశ్
* న్యూఇయర్.. AP, TGలో భారీగా పెరిగిన మద్యం విక్రయాలు
* 5 రకాల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించిన AP ప్రభుత్వం
* 2027 AUG 15న దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్: కేంద్రం
* OP సిందూర్‌కు రాముడే ఆదర్శం: రాజ్‌నాథ్
News January 2, 2026
IPL: గ్రీన్ కంటే పతిరణకే ఎక్కువ డబ్బులు

IPL మినీ ఆక్షన్‌లో గ్రీన్ (₹25.20Cr), పతిరణ (₹18Cr) అత్యధిక ధర పలికిన టాప్-2 ఆటగాళ్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే గ్రీన్ కంటే పతిరణకే ఎక్కువ డబ్బులు రానున్నాయి. ఓవర్సీస్ ప్లేయర్ల ఫీజు విషయంలో <<18572248>>BCCI పెట్టిన లిమిట్<<>> వల్ల గ్రీన్‌కు ₹18Cr మాత్రమే దక్కుతాయి. అందులో IND+AUS ట్యాక్సులు పోగా ఆయనకు మిగిలేది ₹9.9కోట్లే. అటు SL బౌలర్ పతిరణకు ట్యాక్సులు తీసేయగా ₹12.9 కోట్లు మిగులుతాయి.


