News August 23, 2025
నల్గొండ నుంచి నేషనల్ లెవెల్‌కి సురవరం

సురవరం పుట్టి పెరిగింది పాలమూరు జిల్లాలో అయినా ఉద్యమ ప్రస్థానం NLG జిల్లాతో ముడిపడి ఉంది. ఉమ్మడి జిల్లా కమ్యూనిస్టు ఉద్యమంలో, పార్టీ విస్తరణకు ఆయన విశేష కృషిచేశారు. రైతు, కూలీల సమస్యలు, భూస్వామ్య వ్యవస్థ, బానిసత్వంపై CPI తరఫున ఉద్యమాలు నడిపారు. 3 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓడిన ఆయన్ను నల్గొండ ప్రజలు 1998, 2004లో గెలిపించారు. దీంతో ఆయన నల్గొండ నుంచి వెళ్లి జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు.
Similar News
News April 15, 2026
దక్షిణాదికి అన్యాయం జరగనివ్వద్దు: గుత్తా

జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం సీట్లను 50 శాతం పెంచాలని యోచిస్తోందని, అయితే దీనిని కేవలం జనాభా ప్రాతిపదికన కాకుండా, 50 శాతం జనాభా, 50 శాతం GST వసూళ్ల ఆధారంగా చేపట్టాలని NLGలో డిమాండ్ చేశారు. జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.

కర్నూలు జిల్లా విద్యార్థుల ప్రతిభ ఇలా..

కర్నూలు జిల్లా ఇంటర్ ఫలితాల వివరాలను ఆర్ఐఓ లాలప్ప వెల్లడించారు. ఉత్తీర్ణతలో బీసీ రెసిడెన్షియల్ కళాశాలలు ప్రథమ సంవత్సరంలో 97%, ద్వితీయ సంవత్సరంలో 100% ఫలితాలతో అగ్రస్థానంలో నిలిచాయి. ఏపీఆర్ఎస్ నుంచి 91%, 97% సాధించగా, ప్రభుత్వ కళాశాలలు 44%, 71% ఫలితాలు నమోదు చేశాయి. ప్రైవేట్ విద్యాసంస్థలు 71%, 85% ఉత్తీర్ణత సాధించాయి. విద్యార్థుల ప్రతిభపై అధికారులు హర్షం వ్యక్తం చేశారు.