News December 11, 2025
నల్గొండ: పంచాయతీ ఎన్నికలపై నిఘా

పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఉమ్మడి జిల్లాలో అధికారులు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. నేడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 585 GPలు, 4,776 వార్డ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కేంద్రం వద్ద BNSS చట్టం 163 అమల్లో ఉంటుంది. కార్యకర్తలు పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల దూరంలో ఉండాలి. పోలింగ్ కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లకూడదు.
Similar News
News December 12, 2025
హనుమాన్ చాలీసా భావం – 36

సంకట హటై మిటై సబ పీరా|
జో సుమిరై హనుమత బలవీరా||
శక్తిమంతుడు, పరాక్రమవంతుడు అయిన హనుమంతుడిని ఎవరైతే భక్తితో స్మరించుకుంటారో, వారికి కలిగే అన్ని రకాల సంకటాలు, ఇబ్బందులు వెంటనే తొలగిపోతాయి. వారిని పీడిస్తున్న బాధలు, దుఃఖాలు కూడా పూర్తిగా చెరిగిపోతాయి. హనుమంతుడి స్మరణ అనేది భక్తులకు బలం, ధైర్యం, కష్టాల నుంచి విముక్తిని ప్రసాదిస్తుంది. <<-se>>#HANUMANCHALISA<<>>
News December 12, 2025
ఎయిమ్స్ కల్యాణి 172 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

పశ్చిమ బెంగాల్‌లోని ఎయిమ్స్ కల్యాణిలో 172 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 15వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD,DNB,DM,MCH, MSc,M.biotech,M.Stat, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. డిసెంబర్ 26, 27 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://aiimskalyani.edu.in/
News December 12, 2025
విశాఖలో టెక్ తమ్మిన సంస్థకు మంత్రి లోకేష్ శంకుస్థాపన

విశాఖ మధురవాడలోని హిల్ నెంబర్-2లో టెక్ తమ్మిన ఐటీ సంస్థ క్యాంపస్ నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శుక్రవారం భూమిపూజ చేశారు. టెక్ తమ్మిన సంస్థ విశాఖ యూనిట్ ద్వారా రూ.62 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 500 మందిగి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉంది. నెదర్లాండ్స్,దుబాయ్,ఇండియాలో తన సేవలను అందిస్తోంది. ఈ కార్యక్రమంలో సీఈవో రాజ్ తమ్మిన,ఎంపీ భరత్ ఉన్నారు.


